ఈ పధకం ప్రకారం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 11,800 లు మాత్రమే ఉండాలి. అలాంటి కుటుంబ సభ్యునికే ఇది వర్తిస్తుంది.
దీనిలో టి.వి. మెకానిజం, రేడియో మెకానిజం, రిఫ్రిజిరేషన్ కోర్సుల్లో, ఇంకా అనేక కోర్సుల్లో శిక్షణనిస్తారు. ఇవే కాక డ్రై క్లీనింగ్, లాండ్రీ, రెడీమెడ్ గార్మెంట్స్, బుక్ బైండింగ్, వెల్డింగ్ వర్క్ మొదలైన వాటికి సంబంధిత బ్యాంకులు ఋణాన్ని అందిస్తాయి.
అభ్యర్ధి 3 సంవత్సరాలు ఒకేచోట నివాసం ఉండాలి. తమ ఆదాయాన్ని రూఢీపరుస్తూ తెల్ల రేషను కార్డు ప్రతిని అధికారులకు అందించాలి.
ఈ పధకం క్రింద లబ్ది పొందగోరు వ్యక్తి ఏ బ్యాంకుకు గానీ, సంస్ధకు గానీ బకాయి ఉండరాదు. అంతకు ముందు రుణం పొంది ఉండరాదు. బ్యాంకు వారు ఇచ్చే ఋణంలో 25% సబ్సిడీ లభిస్తుంది. స్త్రీలకు, ఎస్.సి., ఎస్.టి.లకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు.
ఆదారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/18/2020