অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఖైదీల ఫిర్యాదులపై దర్యాప్తు

ఫిర్యాదులను విచారించటానికి సాధారణ మార్గదకాలు

  • ఖైదీలు ఫిర్యాదు చేసినప్పుడు వాటిలోని నిజాన్ని వెలికెతీయడం కోసం ;అధికార, అనధికార సందర్శకులు – మూడు పద్ధతులను అవలంబించవలసి ఉంటుంది.
  • మొదటిది, ఫిర్యాదు చేసిన ఖైదీని/ఖైదీలను విచారించి, వారి అనుభవాలు, కష్టాలు ఏమిటొ తెలుసుకోవాలి.
  • రెండవది, జైళ్ళలో అనుసరించే పద్ధతులపైనా, ఖైదీలను నిర్బంధించే పరిస్థితులపైనా – ఈ క్రమంలో జైలు అధికారులు ఎదుర్కొనే సమస్యలపైనా వాళ్ళతో మాట్లాడాలి.
  • ఈ విధంగా మొత్తం విచారణ పూర్తి చేశాక సందర్శకుడు – నిష్పక్షపాతంగా, స్వతంత్రమైన అభిప్రాయాలను ఏర్పరచుకోవలసి ఉంటుంది.
  • మీకు ఒక ఖైదీనుంచి ఫిర్యాదు అందగానే తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు, లేదా జైలు సూపరింటెండెంట్ దగ్గరికో, మానవ హక్కుల కమీషన్ దగ్గరికో వెంటనే పరిగెత్త కూడదు. నిజానిజాలకు సంబంధించి  ముందు మీరు మొత్తం సమాచారాన్ని సేకరించాలి. కేసుకు సంబందింధిన విషయాలను జైల్లు అధికారులతో మాట్లాడే టట్టుగా ఫిర్యాదుని ప్రోత్సహించాలి. వాళ్ళు మాట్లాడే అధికారి ఖైదీల క్రమశిక్షణ, సంక్షేమం చూసేవాడు అయిఉండాలి. అయితే ఆ అధికారి దగ్గర నుండి సమస్యకు పరిష్కారం దొరకదని అనుమానం ఉంటే ఫిర్యాదీని (ఖైదీని) అంతకంటే పై అధికారి దగ్గరకు వెళ్ళేటట్టు ప్రొత్సహించాలి.
  • ఒక సహేతుకమైన ఫిర్యాదు వచ్చినప్పుడు, ఆ ఆరోపణలు చేసిన వ్యక్త్ చివరి దాకా నిలబడేటట్టు నైతిక బలాన్ని చేకూర్చడం చాలా ముఖ్యం.

ఫిర్యాదుల దర్యాప్తుకు అనుసరించదగిన ప్రత్యేక పద్ధతులు

  • ఒక ఫిర్యాదుల్లోని నిజానిజాలను వెలికి తీయడానికి ఒక్కొక్కరినీ విడివిడిగా కలిసి, ఎంత వరకు వీలయితే అంతవరకు విషయం నిరూపణకు అవసరమైన వివరాలు రాబట్టగలగాలి.
  • ఫిర్యాదితో మాట్లాడేటప్పుడు – ఎస్కార్ట్ మీ వెంట ఉన్నట్లయితే,మీరు ఖైదీలతో మాట్లాడే విషయాలు ఎస్కార్ట్ గా వచ్చిన వ్యక్తికి వినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎస్కార్ట్ కు కనపడే పరిధిలోనే ఉండి వినపడనంత దూరంలో మాట్లాడాలి.
  • సునీల్ బాత్రా (II) కేసులో, సుప్రీంకోర్డు – ‘అవసరమైయితే జైళ్ళశాఖ అధికారుల సమక్షంలోనే. వారికి వినపడకుండా మాట్లాడవచ్చని .... ‘ చెప్పింది.
  • అయితే ఎస్కార్ట్ అధికారుల సమక్షంలో ఖైదీని ఇంటర్వ్యూ చేయడం క్షేమకరం కాదు అనుకుంటే, ఉన్న పరిస్థితులలో ఏది తగినదనిపిస్తే అధి చేయాలి

సేకరించే విషయంలో ఉండాల్సిన అంశాలు

  • సంఘటన జరిగిన తేదీ, సమయం.
  • సాక్షులతో సహా సంఘటనకు సంబంధమున్న వారందరి పేర్లు
  • ఆ ఫిర్యాదులో పేర్కొన్న చర్యకు కారకుడైన వ్యక్తి పేరు, జైలులో ఆ వ్యక్తి స్థానం (జైలు అధికారి అయిన పక్షంలో హోదా తదితర వివరాలు).
  • ఆ చర్య లేదా నేరాన్ని ఒక్కరే చేశారా, కొందరు కలిసి చేశారా. ఇతర ఖైదీలు, అధికారులతో కుమ్మక్కయి చేశారా ఆ వివరాలు.
  • ఆ చర్యకు పాల్పడిన వ్యక్తి లేదా వ్యక్తుల ఉద్దేశాల గురించి ఫిర్యాది అంచనా ఏమిటి?
  • ఖైదీ(ఫిర్యాది) చెప్పిన విషయాలను ధృవపరిచే ఇతర ఖైదీల, సాక్షుల నుండి విషయ సేకరణ
  • ఒకే రోజులో ఇంటర్వ్యూలు పూర్తి చేయటానికి ప్రయత్నించాలి. ఖైదీలనేకాక జైలు అధికారులను కూడా కలిసి వారి కథనం కూడా పైన చెప్పిన రీతిలోనే తీసుకోవాలి. దీన్ని చివరికంటా దర్యాప్తు చేస్తానని, అనేక మంది దగ్గర సాక్ష్యాలను సేకరించానని సంబంధిత వ్యక్తులకు తెలియజేయండి. ఆ రకంగా ఫిర్యాది తన కథనాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా, వారిపై ఆ ఒత్తిడి రాకుండా చూసుకోండి.
  • మీరు సేకరించిన విషయాలు అన్ని వైపుల నుండి పరిశీలించి నిస్జ్పాక్షికంగా విశ్లేషించాక కూడా నిజమేనని అనిపిస్తే జైలు అధికారులు తమ తప్పును అంగీకరించడానికి సిద్ధంగా లేరనిపిస్తే – అప్పుడు మీరు సెషన్స్ జడ్జి దగ్గరకు గానీ, జిల్లా  కలెక్టరు దగ్గరకు గానీ వెళ్ళే విషయం ఆలోచించండి. వాళ్ళకు ఈ కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను నివేదించాలి.ఒకవేళ ఈ విషయాలన్నింటినీ నివేదించినందువల్ల ఆ ఖైదీకి అపకారం జరిగే ప్రమాదం ఉందని అనిపిస్తే వెంటెనే మళ్ళీ జైలుకు వెళ్ళాలి

గుర్తు పెట్టుకోండి

  • ఫిర్యాదులోని నిజానిజాలు వెలికితీసే సందర్బంలో – భద్రతకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాలి. అవసర మనిపిస్తే రక్షణ లభీంచే వేరే జైలుకు అతన్ని బదిలీ చేయమని సిఫారసు చేయాలి.
  • ఒక ఖైదీ ఇతర ఖైదీలపై దాడి చేసి గాయపరుస్తున్నప్పుడు లేదా జైఉలో దొమ్మీ జరుగుతున్నప్పుడు మాత్రమే జైలు అధికారులు ఆత్మరక్షణ కోసం హింసను ప్రయోగించవచ్చు. ఇతర ఏ సందర్భంలోనూ వారు హింసను ప్రయోగించడానికి వీల్లేదు.
  • జైలులో ఉండవలసిఅన క్రమశిక్షణను భంగపరచటానికి ఎవరైనా ఖైదీ ప్రయత్నించినా, మరే ఇతర న్యాయ బద్ధమైనా కారణాల వలన గొడవ జరిగినా కూడా – ఖైదీలకు విధించే శిక్షలను ఖైదీలపై హింసను ప్రయోగించడానికి వీల్లేదు. అధికారులు రాసే రికార్డులను యధాతథంగా స్వీకరించకుండా, వాటిని సొంతంగా పరిశీలించిన తర్వాతనే, ఖైదీలపై ప్రయోగించిన హింసపై ఒక నిర్ణయానికి రావాలి

చివరగా, గుర్తుపెట్టు కోవాల్సిన అంశాలు

  • ఫిర్యాదుల గురించి వాస్తవాలు నిర్ధారించుకోకుండా చర్యకు పూనుకోకూడదు. అలాగే జైలు సిబ్బందిని విష యాలు తెలుసుకోకుండా బహిరంగంగా తిట్టకూడదు, ఎందుకంటే ఆవేశాలు పెరిగిపోయి సమస్య మరింత జటిలమవుతుంది. పరిష్కారం ఇంకా ఆలస్యం అవుతుంది.                                          .
  • ప్రతి ఫిర్యాదుపైనా లోతైన దర్యాప్తు జరపాలి. జైలుఅధికారులను ఇబ్బంది పెట్టలనే ఉద్దేశంతో ఇచ్చేటప్పుడు ఫిర్యాదులను తగ్గించడం కోసం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎందుకంటే అబద్ధపు ఫిర్యాదుల వలన జైలు లో ఉండే క్రమ శిక్షణ దెబ్బతిన వచ్చు. అలాగే అనవసరమైన ఉద్రేకాలు రెచ్చగొట్ట బడవచ్చు
  • ఖైదీలు ఇచ్చే మౌఖిక ఫిర్యాదులను నమోదు చేసుకొని ఆ తర్వాత అవసరమైన లిఖిత సాక్ష్యా ధారాలను సేకరించు కోవాలి.
  • జైలు సిబ్బందితో మర్యాదగా వుండడం వలన, మంచి సలహాదారుగా కూడా ఉండవచ్చు.
  • జైలు సిబ్బంది నుండి వ్యతిరేకత కంటే, సహకార ధోరణి మనకు ఎక్కువ ఉపయోగం, జైలు సిబ్బంది సహ కారం ఉంటే మనం సాధించవలసిన జైలు సంస్కరణలకువారు అడ్డంపడకుండా సానుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate