జైలు సందర్శకుల అధికారాలు, బాధ్యతలు, పరిధులు
జైలు మాన్యువల్ ప్రకారం జైలు సందర్శకుల అధికారాలు, పరిధులు
ఆంధ్రప్రదేశ్ జైలు మాన్యువల్ లో ఈ విధంగా ఉంది.
- ఖైదీల జీవన పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి సందర్శకులు జైలులోని అన్ని భాగా లను సందర్శకులు జైలులోని అన్ని భాగాలను సందర్శించవచ్చు .
- నిహార దీక్షలో ఉన్న ఖైదీలను, క్రమశిక్షణ కారణాల రీత్యా విడిగా ఉంచిన ఖైదీలను , ప్రత్యేక తరగతి కి చెందిన ఖైదీలుగా ప్రభుత్వం గుర్తించిన వారిని తప్ప మిగిలిన అందరు ఖైదీలనూ కలిసి మాట్లాడే అధికారం సందర్శకులకు ఉంది .
- జైలు సందర్శకునికి సరియైన కారణాలు లేకుండా ఫిర్యాదు చేశాడన్న కారణంపై ఒక ఖైదీని జైలు అధి కారి శిక్షించదలిస్తే కనుక జరిగిన విషయాన్ని వేయదలచిన శిక్షను రాతపూర్వకంగా సందర్శకునికి తెలియ జేయాలి. జైలు అధికారి నిర్ణయంతో సందర్శకుడు విభేదిస్తే, ఆ కేసును జైళ్ళ ఇన్ స్పెక్టర్ జనరల్ కు పంపాలని కోరొచ్చు. జైళ్ళ ఐజీ తన నిర్ణయాన్ని సందర్శకునికి తెలియ జేయాలి.ఆ తర్వాత సందర్శకుడు అవసరమైతే, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రయవచ్చు .
- పైన పేర్కొన్న నిబంధన జైలు సందర్శకులకు వివిధ ప్రభుత్వ శాఖలను సంప్రదించే అవకాశం ఇస్తుంది,. వారు జిల్లా కలెక్టరును సెషన్స్ న్యాయమూర్తిని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, వైద్య సేవల డైరెక్టరును, జైళ్ళ శాఖ మంత్రిని, జైళ్ళ శాఖ ముఖ్య కార్యదర్శిని, రాష్ట్ర జాతీయ మానవ హక్కుల సంఘాలను, మహిళా సంఘాలను సంప్రదించవచ్చు.
- పురుష సందర్శకులకు ఉన్న అన్ని అధికారాలు మహిళా సందర్శకులకు ఉంటాయి. అయితే వారి అధికారాలు మహిళా ఖైదీల సమస్యలకే పరిమితం .అయితే జైలు సందర్శకులు అధికారులకు ఎటువంటి అదేశాలు లేక ఆజ్ఞలు జారీ చేయరాదు
సందర్శకులు తమ బాధ్యతాయుత పాత్రను ఏ విధంగాను దుర్వినియోగం చేయరాదు
- ప్రభావవంతంగా పనిచేయాలంటే సందర్శకులు తమ విధులను నీతివంతంగానూ, బాధ్యతాయుతం గాను నిర్వర్తించాలి. ఈ అధికారాన్ని దుర్వినియోగపరచ కుండా ఉండేందుకు వారికి కొన్ని సూచనలు.
- జైళ్ళ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగపరచకుండా నిరోధించేందుకే జైళ్ళ సందర్శకులను నిమిస్తారు. కాబట్టి మళ్ళీ జైలు సందర్శకులు ఖైదీల ముందు తమ దర్పాన్ని ప్రదర్శించడానికో, లేక ఖైదీలపై అధికారులకున్న నైతిక అధికారాన్ని బలహీన పరచడానికో తమ అధికారాన్ని దుర్వినియోగ పరచ కూడదు.
- మీకు తెలిసిన వారో, లేక మీ బంధువులో జైలులో ఉంటే, సాధారణ ఖైదీలకు ఇచ్చే సౌకర్యాలకు భిన్నంగా ప్రత్తేక వసతులు వారికి ఇవ్వాలని మీరు కోరడం అనైతికం.
- ఖైదీలందరినీ సమానంగా, న్యాయంగా చూడాలని వాదించడానికే జైళ్ళ సందర్శకులు ప్రయత్నించాలి.
- సమస్యలలో, బాధలతో ఉన్న పేద ఖైదీల గురించి మాట్లాడి మీరుగాని, మీ ఆహ్వానంపై సేవలందించ డానికి మీతో వచ్చిన వారు కాని ప్రచార లబ్ధిని పొందాలని ఎప్పుడు ప్రయత్నించరాదు.అటువంటి ప్రయత్నాలు అనైతికమేకాక, దుష్ఫలితాలనిస్తాయి.
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.