జైళ్ళ అధికారిక సందర్శకులలో సెషన్స్ జడ్జి చాలా ముఖ్యమైన వ్యక్తి. నేరస్తులంతా కోర్టు ఉత్తర్వుల ద్వారనే జైలుకు పంపబడతారు. కాబట్టి, ఖైదీల బాగోగులు చూడవలసిన బాధ్యత జడ్జీలపై మరింత ఎక్కువ ఉంటుంది.
అర్హులను బెయిల్ పై విడుదల చేయడం ద్వారానూ, పరిశోధనను వేగవంతం చేయమని ఆజ్ఞాపించడం ద్వారానూ – జడ్జీ జైళ్ళలోని రద్దీ సమస్యను చాలావరకు తగ్గించవచ్చు. మొత్తం ఖైదీలలో 75% విచారణ కొరకు ఎదురుచూస్తున్న వారే కనక వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు జైళ్ళ పరిస్థితి మెరుగుకావడం అసాధ్యం.
నిజానికి సందర్శకుల బోర్డుకి సెషన్స్ జడ్జీ ఛైర్ పర్సన్ గా ఉండాలని కూడా ముల్లా కమిటీ సిఫారసు చేసింది. ఊచల వెనుక ఉన్న మనుషులను మరిచిపోవడం వలన ఎటువంటి అనర్థాలు జరుగు తాయో అజయ్ ఘోష్ కథ మనకు విశదపరుస్తుంది.
1962 లో సోదరుణ్ణి చంపిన కేసులో అజయ్ ఘోష్ అరెస్టు అయ్యాడు. ఆ తరువాత అతను మానసిక రోగి అని గుర్తించి, విచారణకు అనర్హుడని తేల్చారు. అతన్ని ఏ రోజూ కోర్టుకు తీసుకు రాకపోగా 1968లో వాళ్ళ్ అమ్మ చనిపోయాక అతన్నికలవడాని కూడా ఎవరూ జైలుకు రాలేదు. అతడు కలకత్తాలోని ప్రెసిడెన్సీ జైల్లో 37 సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు. ఈ కాలంలో కేసులోని సాక్షులు, కేసును విచారించే జడ్జి సైతం మరిణించారు. అయినా అతను అలాగే ఏ నివారణకు నోచుకోకుండా జైలులోనే గడిపాడు.
1995లో కలకత్తా హైకోర్టు అజయ్ ఘోష్ ను మానసిక చికిత్సా కేంద్రానికి పంపమని ఉత్తర్వు జారీ చేసినా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వందాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత అతనికి చూపు మందగి6చింది, మాట్లాడటం కూడా మరచిపోయాడు.
చివరకు. 1999 నవంబర్ లో ఈ కేసు భారత ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎస్ . ఆనంద్ గారి దృష్టికి వచ్చింది. అప్పుడు ఆనంద్ గారు – అజయ్ ఘోష్ ను కలకత్తాలోని ఒక ధార్మిక మిషనరీ నడుపుతున్న మానసిక చికిత్సాకేంద్రానికి బదిలీ చేయమని ఉత్తర్వు జారీ చేయడమే కాకుండా, అతని వైద్యావసరాలకు 2 లక్షల పరిహారం ఆ చికిత్సా కేంద్రానిఇ చెల్లించమని కూడా చెప్పారు. సెషన్స్ జడ్జీలను తరచూ జైళ్ళకు రప్పించగలిగితే అజయ్ ఘోష్ లాంటి విషాద సంఘటనలు పునరావృతం కాకుండా చూఉకోవచ్చు.
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/6/2020