మానవ హక్కుల పరిరక్షణ చట్టం (1993)లోని సెక్షన్ 12(సి) ప్రకారం, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఈ క్రింది విధులున్నాయి.
“రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి, దాని అధీనంలో ఉన్న ఏదేని జైలును లేదా రక్షణ, సంస్కరణ, చికిత్స ఉద్దేశంతో వ్యక్తులను నిర్బంధించిన మరే ఇతర సంస్థను గాని అధ్యయనం చేయడానికి, సిఫారసు చేయడానికి సందర్శించవచ్చు”.
కస్టడిలో జరుగుతున్న హింస గురించి, అవకతవకల గురించి ఖైదీల నుంచి ఫిర్యాదు అందుకుని లేదా తనకు తానుగా సంఘం దేశ వ్యాప్తంగా ఉన్న అనేక జైళ్ళను సందర్శించింది. అక్కడి తీవ్రమైన లోటుపాట్లను గుర్తించి, సంబంధిత రాష్ట్ర అధికారులతో సంప్రదించడం జరిగింది. చాలా కేసులలో తగిన నష్టపరిహారాన్ని కూడా సంఘం సిఫారసు చేసింది.
జాతీయ మానవహక్కుల సంఘం ప్రారంభమైన నాటి నుంచి జైళ్ళ సంస్కరణలకు సంబంధించి అది చాలా కార్యక్రమాలను చేపట్టింది. అందులో కొన్ని:
ముక్తారాం సీతారాం షిండే వర్సెస్ స్టేట్ ఆఫ్ మాహారాష్ట్ర వివాదంలో ముంబాయి హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం, ఆ రాష్ట్ర్రం లోని 33 జైళ్ళలోని విజిటర్స్ బోర్డుకు 33 మందిని జాతీయ మానవ హక్కుల సంఘం తన ప్రతినిధులుగా నియమించింది. వారిలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు, పోలీసులు, న్యాయవాదులు, అధ్యాపకులు ఉన్నారు. వీరు సంఘం తరపున జైళ్ళను సందర్శించి, అక్కడి పరిస్థితులపై సంఘానికి నివేదింధే అధికారం పొందారు. ఆ ప్రతినిధులు ఇచ్చిన నివేదిక పై ఆధారపడి, సంఘం మార్గదర్శకాలను/ఆదేశాలను విడుదల చేస్తుంది.
మానవహక్కుల ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పటి కప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు/ఆదేశాలు ఇస్తూనే ఉంది95. అవి చట్టంతో సమానం. కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను ఆయా అధ్యాయాలలో అనుబంధంగా ఇవ్వడం జరిగింది. సందర్శకులు వీటి అమలు గురించి సంబంధిత జైలు అధికార్ల, న్యాయమూర్తుల, జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతుండాలి. కమిషన్ కు పనిభారం చాలా ఉంటుంది. కనుక మిగిలిన అన్ని అవకాశాలు అయిపోయిన తర్వాత మాత్రమే సందర్శకులు కమీషన్ ను సంప్రదించాలని కోరుతున్నాం.
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/22/2020