- Induction, Sentence Management and Risk Assessment, Offending Behavior Programmes, Life Work, TemoporarY Release, Parole, లాంటి బాధ్యతలను ప్రొబేషన్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఖైదీలతో వ్యవహరించే పద్ధతులపై జైళ్ళ సిబ్బందికి శిక్షణ ఇచ్చే పని కూడా వాళ్ళదే. ప్రస్తుత సీనియర్ ప్రొబేషన్ అధికారి తన విధులను సెప్టెంబరు 1, 1999 న ప్రారంభించాడు. అతను ఈ విభాగానికి అధిపతిగా, సీనియర్ మేనేజ్ మెంట్ పాలసీ గ్రూపులో సభ్యుడుగా, మొత్తం జైలు నిర్వహణకు బాధ్యుడుగా ఉన్నాడు. జైలు ఉపప్రధానాధికారి అధ్యక్షత వహించే ప్రొబేషన్ విధాన నిర్ణయ గ్రూపులోను అతను సభ్యుడే. 1999 సంవత్సరమంతా ఈ గ్రూపు సుప్తావస్థలో ఉండింది. ఇప్పుడు కొత్త సిబ్బందితో ఇది చురుకుగా పని చేస్తుందని ఆశిస్తున్నాం.
- పని ఒత్తిడి, వనరుల కొరత ఉన్నప్పటికీ, 30 రకాల తరగతులను నిర్వహించడంలో ఈ ప్రొబేషన్ యూనిట్ విజయం సాధించింది. ప్రొబేషన్ సేవల విభాగానికి, జైళ్ళ విభాగం అధికారులకు మధ్య ఉన్న సహకారం ప్రశంసనీయం.
- తాత్కాలిక ప్రాతిపదికన పోయిన సంవత్సరం నియమితుడైన మానసిక వైద్య సహాయకుడి ఉద్యోగం ఇప్పుడు పూర్తి కాలానికి పొడిగించబడింది.
- హింస, మాదక ద్రవ్యాల వాడకం, తాగుడు లాంటి సమస్యల పై తరగతులు నిర్వహించే గదులలోనే ఈ ప్రొబేషన్ విభాగం కూడా ఉన్నది. ఈ గదులను విశాలం చేసి ఖైదీల ఆలోచనా శక్తిని పెంచే తరగతులను నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం అనుకున్న పేరెంటింగ్ వర్క్ షాపును నిర్వహించడం సాధ్యంకాలేదు.
వంటగది
- కొత్త సామాగ్రి వచ్చాక వంటగదిలో పని పరిస్థితులు, వండిన పదార్థాల ప్రమాణం, బ్యారక్ లకు సరఫరా మెరుగుపడింది. కెచెన్ సిబ్బందికి విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేస్తే వారికి జాతీయ వృత్తి అర్హత కోర్సులలో తరగతులు నిర్వహించడం సాధ్య పడుతుంది.
- ఆహారం గురించి ఫిర్యాదులు తక్కువే వచ్చాయి. నాలుగు వారాలకు ఆహార జాబితా (మెను)ను తయారు చేసినందుకు సిబ్బందిని అభినందించాలి. ఇందులో ఆరోగ్యకరమైన వంటకాల జాబితా కూడా ఉంది. హార్ట్ బీట్ అవార్డు స్కీం కింద ఇక్కడి వంటశాలను గుర్తించాలని జిల్లా పర్యావరణ ఆరోగ్య అధికారి సిఫారసు చేస్తున్నాడు.
శారీరక వ్యాయామం
సిబ్బందితో పాటు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తగ్గి పోవడంతో, శారీరక వ్యాయామానికి సంబంధించిన కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. వ్యాయామానికి చెందిన సౌకర్యాలు లేవనేది ఖైదీలు గత ఏడాది చేసిన ప్రధాన ఫిర్యాదు. వ్యాయామశాలలో వెయిట్ లిప్టింగ్ జనాదరణజ్ పొందిన విభాగం. ;స్థానిక మ్యాచ్ లలో జైలు పుట్ బాల్ జుట్టు ఎప్పుడూ అగ్రభాగానే ఉంటుంది. ప్రతి ఖైదీకి శరీర వ్యాయామానికి సౌకర్యం కల్గించడానికి వ్యాయామ సిబ్బంది చాలా కష్టపడి పని చేయాల్సి వచ్చింది. ఆటలు వచ్చిన అధికారులు తగినంతమంది లేక పోవడం కూడా సమస్యయింది. అదనపు నిధులు ఇచ్చి ఎక్కువ మందికి ఆటలలో ప్రావీణ్యం కల్పించవచ్చు.
నిరీక్షించే గది (Waiting room)
- ఈ సౌకర్యాన్ని బాగా వినియోగిస్తున్నారు. సందర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
సోదా ప్రదేశం
- సందర్శకులను సోదా చేసే ఒక చిన్న ప్రదేశం అది. సోదాకు ముందు వాళ్ళు అక్కడ నిరీక్షించాలి.దీనిపై కప్పు వేస్తామన్నారు. కాని ఇంకా వేయలేదు.
సందర్శకుల గది
- అన్ని టెబుళ్ళకు నెంబర్లు ఉంటున్నాయి. కనుక ఖైదీని ఎక్కడ కూర్చోబెట్టాలో ముందే నిర్ణయించి తద్వారా కెమెరాల కనుసన్నలలో ఖైదీలు ఉండేటట్లు అధికారులు చేయగల్గుతున్నారు. అక్కడి వాతావరణం ఖైదీలకు నచ్చేలా ఉన్నప్పటికీ, గేటు దగ్గర, సోదా చేసి పంపే చోట సందర్శకులు ఎక్కువసేపు నిరీక్షించాల్సి వస్తుందని ఖైదీలు ఫిర్యాదు చేస్తున్నారు.
- చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన క్రెష్ సౌకర్యం బాగుంది. వారాంతంలో స్థానిక తల్లుల సంఘం సభ్యులు వచ్చి సహాయం చేస్తున్నారు
జీవిత శిక్ష పడ్డ ఖైదీల యూనిట్
- నిబద్ధత, నైపుణ్యం ఉన్న అధికారులతో ఈ యూనిట్ మెరుగవుతూ వస్తోంది. బదిలీ చేసే ముందు ఖచ్చితమైన నివేధికలను తయారు చేస్తున్నందుకు ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సంస్థ అభినందించింది కూడా. నెలకు రెండు సార్లు జీవిత ఖైదీల శిక్షను సమీక్షిస్తున్నారు. ఆ తేదీలు ముందే నిర్ణయమైనందు వల్లాధికారులందరూ వీటికి హాజరు కావడానికి వీలవుతోంది.
- ఖైదీని జైలులో చేర్చుకునే పద్ధతి కూడా మెరుగవుతూ వస్తోంది. అడ్మిషన్ అయిన రెండు వారాలలోపు ప్రతి జీవిత ఖైదీనిన్ శిక్షణ పొందిన అధికారికి అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం 25మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు. అవసరం పడినప్పుడు, ఖైదీలు ఈ అధికారిని సంప్రదించగలుగుతున్నారు. కాని కెన్నెట్ జైల్లో ఎక్కువమంది జీవిత శిక్ష పడ్డ ఖైదీలు ఉండడం, అది వెసెక్స్ లో ఉండడం సమస్యగానే ఉంది
బయట పని చేస్తున్న పార్టీలు
- బయటి పథకాలలో పని చేయడానికి ‘డి’ కేటగిరి ఖైదీలు ఉన్నారు. అనే విషయం ప్రచారం జరిగితే పని చేయడానికి ఖైదీలకు అవకాశాలు చాలా పెరుగుతాయని సిబ్బంది అంటున్నారు. ప్రస్తుతం నోటి మాట ద్వారా, సిబ్బంది వ్యక్తిగత సహాయం ద్వారా మాత్రమే బయట పనులు లభ్యమవుతున్నాయి.
- రవాణాను పెద్ద సమస్యగా చెప్పినప్పటికీ నిజానికి డ్రైవరు లేకపోవడం అసలు సమస్య. రోజుకు నాలుగు గంటలు పనిచేసే తాత్కాలిక ఉద్యోగిని-బహుశా జైలు డిపార్టుమెంటు నుండి పదవీ విరమణ చేసిన వ్యక్తిని – పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు.
- ప్రస్తుతం 15 మంది ఖైదీలు మాత్రమే బయట పని చేస్తున్నారు. దొరికితే మరొక 8 మంది అర్హులవుతారు పార్ట్ టైం డ్రైవరు దొరికితే తప్పకుండా పరిస్థితి మెరుగవుతుంది.
నిర్మాణ పరిశ్రమలో శిక్షణ
- జైలు నేరుగా నియమించకున్న శిక్షకులు ప్రస్తుతం రంగులు వేయడం, అలంకరించడం, ఇటుకలు చేయడం, ఇంజినీరింగ్ డ్రాయింగ్ లో శిక్షణ యిస్తున్నారు.
- ఇటుకలు చేసే పనిలో సగటున 12 ఖైదీలు సంవత్సరం పొడవునా పని చేస్తున్నారు. పనిలో నైపుణ్యం నేర్పించడం పైనే ఎక్కువమంది దృష్టి పెట్టినప్పటికీ, జాతీయ వృత్తి విద్యార్హత సంపాదించాలకున్న వారు దానికోసం కూడా చేయవచ్చు.
- సాధారణంగా ఇంజినీరింగ్ డ్రాయింగ్ కోర్సులో 9 మందిఖైదీలు ఉంటారు. కాని ప్రస్తుతం 12 మంది ఉన్నారు. వీటితో పాటు కంప్యూటర్ల మరమ్మత్తు, నిర్వహణ, ప్రోగ్రామింగ్ లాంటి వాటిలో కూడా ఖైదీలకు తరగతులు నిర్వహిస్తున్నారు. డ్రాయింగ్ లో నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
- పెయింటింగ్ , డెకరేటింగ్ లు చాలా ఆదరణ పొందిన కోర్సులు. వీటిలో గరిష్టంగా 8మంది ఖైదీలు ఉంటారు. ఈ కోర్సులలో చాలా మంది ఉన్నతమైన ప్రమాణాలు సాధించి, జైలు చుట్టూ ఉన్న ప్రాంతాలలో చిన్న చిన్న ఇంటీరియర్ డిజైనింగ్ పనులు చేపడుతున్నారు.
- నిధులు చాలా వరకు తగ్గించినప్పటికీ, ఉన్నత ప్రమాణాలతో నిర్మాణ పరిశ్రమలో శిక్షణను నిర్వహిస్తున్నా రంటే ఆ కీర్తి బోధకులకే చెందుతుంది.
కుట్టుయంత్రాల మరమ్మత్తు శిక్షణ
- గత సంవత్సరం బ్రిటీషు ప్రమాణాల సంస్థా గుర్తింపు కూడా పొందిన ఈ కుట్టుమిషన్ల మరమ్మత్తు శిక్షణ తన ప్రమాణాలను అలాగే కొనసాగిస్తూంది.
- పబ్లిక్ లేక ప్రైవేటు రంగంలో బ్రిటిషు ప్రమాణాల కైట్ మార్క్ ను పొందిన ఒకే ఒక్క కుట్టుమిషన్ల మరమ్మత్తు కేందంగా దీనికి గుర్తింపు వచ్చింది.
తీవ్రమైన సంఘటనలు/రూలు45/చట్టబద్ధ నియంత్రణలు
- కస్టడీలో జరిగిన పాల్ కుకు మరణం మాత్రమే ఈ సంవత్సరంలో జరిగిన తీవ్రమైన సంఘటన.
- రూలు 45 లేక 48 క్రింద ఒంటరి గదుల శిక్షగానె ప్రత్యేక గదులు, వైద్య నియంత్రణలు గాని ఈ సంవత్సరంలో అవరికీ విధించలేదు.
సందర్శకుల బోర్డ్ చేపట్టిన పనులు
శిక్షణ
- నెలనెలా జరిగే బోర్డు సమావేశాలలో స్థానిక శిక్షణకు సమయం కేటాయించారు. అంతే కాక ఈ సంవత్సరం జరిగిన జాతీయ శిక్షణ తరగతులకు చాలామంది బోర్డు సభ్యులు హాజరయారు.
- జైలు సిబ్బంది నిర్వహించిన ‘వాస్తవ’ సంఘటనల శిక్షణా కార్యక్రమంలో కూడా బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
- ‘టీమ్ పెర్ఫామెన్స్ రివ్యూ’ పై బోర్డు ఒకరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
- సమావేశాలు బోర్డు ఏడాదికి 12 సార్లు, ప్రతి నెలలో మూడవ మంగళవారం సమావేశమౌతుంది. సాధ్యమైనప్పుడల్లా తమకు ప్రత్యేక ఆసక్తి గల అంశలపై జైల్లో జరిగే సమావేశాలకు సభ్యులు హాజరవుతారు
వంతులవారీ సందర్శన
బోర్డు సభ్యులు వారంవారం వంతుల వారీగా జైలును సందర్శిస్తారు. జైలు ప్రధానాధికారి ఇచ్చిన రాతపూర్వక సమాధానాలను కూడా కలిపి అన్ని ముఖ్యమైన అంశాలపై నెలవారీ తయారు చేస్తారు. బోర్డు లోని ప్రతి సభ్యుడికి ప్రత్యేక ఆసక్తి ఉన్న రంగాలు ఉన్నప్పటికీ, నివేదికలు మాత్రం జైలులో జరిగే ఖైదీల, సిబ్బంది కార్యక్రమాలు మొత్తంపై ఉంటాయి
అవగాహన చర్చలు
- ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2.00గంటలకు కొత్త ఖైదీలని కలవడానికి వచ్చే బోర్డు సభ్యులతో అవగాహన చర్చలు జరుపుతూనే ఉన్నారు
దరఖాస్తులు
- నెలవారీ సమావేశాల్లో మొత్తం బోర్డు సభ్యులందర్నీ కలవాలని ఖైదీ కోరితే తప్ప ఇతరత్రా తమను కలవాలన్న వారి దరఖాస్తులను కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమోదిస్తున్నారు. మేము ఈ జైలును పరిశీలించిన ఏడాది కాలంలో ఖైదీలనుండి మొత్తం 54 దరఖాస్తులు అందాయి. పోగొట్టుకున్న వస్తువులు, ఎస్కార్ట్ విజిట్స, ఉపాధి ఫోన్ కాల్స్ , తగ్గిపోయిన శారీరక వ్యాయామం వంటి సమస్యల పై ఈ దరఖాస్తులు ఇచ్చారు. చాలా దరఖాస్తులు ఖైదీలు గతంలో ఉన్న జైళ్ళకు సంబంధించినవి. సందర్శకుల బోర్డుకు అంత తక్కువ ఫిర్యాదులు వచ్చాయంటే వారి ఫిర్యాదులను అధికారులు చాలా చక్కగా పరిష్కరిస్తున్నారని అర్థం చేసుకోవాలి.
ఇతర జైళ్ళ సందర్శన
- శిక్షణ కొరకు, బోర్డు సభ్యులు డోర్ సెట్ లోని ‘వీరే’ మరియు ‘వెర్నీ’ జైళ్ళను సందర్శించారు
విజయాలు
- జైళ్ళ విభాగంలో ఆదాయం సృష్టించేందుకు ఏర్పడిన నాక్ వర్కింగ్ పార్టీలో మిస, జెన్ని బడ్గెల్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆమెను ఇటీవలే బ్రిటన్ లోని యువనేరస్తుల జైలు సందర్శకుల బోర్డుకు కూడా సభ్యురాలుగా నియమించారు. ఆమె రెందు చోట్లా కొనసాగ గలదని ఆశిస్తున్నాం.
- మిస్ , క్రిష్టినా లిగో జాతీయ విజిటర్స్ బోర్డుకు శిక్షకురాలిగాను, బ్రిస్టల్ జైలు సందర్శకుల బోర్డుకు అధ్యక్షురాలిగాను నియమించ బడింది. ఆమె కూడా తన ద్వంద్వ సభ్యత్వాన్ని నిలుపుకుంటుందని ఆశిస్తున్నాం.
- క్రమశిక్షణా సంఘంలోని నల్గురు సభులలో ఒకరిగా జాతీయ స్థాయిలో మిస్టర్ ఆర్థర్ విలియమ్స్ నియమించ బడ్డారు
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.