న్యాయమూర్తి వి.ఆర్. కృష్ణయ్యర్ అధ్యక్షతన మహిళా ఖైదీల సమస్యలను చర్చించడానికి జాతీయ స్థాయిలో నిపుణుల సంఘాన్ని (National Expert Committee on Women Prisoners) 1987 లో నియమించారు. ఆ సంఘం సమర్పించిన నివేధికలో సమగ్రమైన సూచనలు, సిఫారసులు ఉన్నాయి.
మహిళాఖైదీల విషయంలో అనధికార సందర్శకులు నిర్వహించాల్సిన ముఖ్యమైన పాత్రను ఆ సంఘం ఇలా వివరించింది.
జైళ్ళకు అనధికార సందర్శకులను నియమించే సంప్రదాయమైతే ఉందికాని, అధి కాగితం మీదే ఉంది. జిల్లాలలోని మహిళా సామాజిక కార్యకర్తలకు జైళ్ళను సందర్శించడానికి తగినంత అధికారమిస్తే, సంఘం ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించడానికి వారు చాలావరకు తోడ్పడగలరని సంఘం సంప్రదించిన స్వతంత్ర పరిశీఅలకులు సిఫారసు చేశారు. ఈ ప్రతిపాదనను అంగీకరించి, అన్ని జైళ్ళకు శాశ్వత ప్రాతిపదికన సందర్శకుల సంఘాలను నియమించాలని సంఘం సిఫారసు చేస్తున్నది. నిబద్ధత. అవగాహన కలిగిన మహిళా కార్యకర్తల బృందాలను ఏర్పాటు చేసుకుని వారి నుండి రొటేషన్ ప్రాతి పదికన సభ్యుల్ని నియమించుకుని వారు ప్రతి నెలా సమావేశం అయ్యేలా చూడాలి. వరుసగా రెండు సమావేశాలకు గైర్జాజరు అయితే, దానిని అనాసతిగా పరిగణించి, కొత్త సభ్యులను నియమించు కోవాలి. దీర్ఘ కాలం ఈ పనికొరకు అందుబాటులో ఉండలేని ప్రముఖ పౌరులకు – వారు మంచి ఉద్దేశాలు గలవారైనా – సందర్శకుల సంఘాలలో సభ్యత్వం ఇచ్చి వాటిని అలంకార ప్రాయంగా తయారు చేయకూడదని ఈ సంఘం స్పష్టం చేయదల్చుకుంది. ప్రభుత్వం నియమించే సంఘాలలోని సభ్యుల నుండి దురుదృష్ట వశాత్తు ఆశించిన స్థాయిలో అర్థవంతమైన పనులు జరగడం లేదు. దానికి ప్రస్తుత సంఘం కూడా మినహాయింపు కాదు.
మహిళా ఖైదీ ని ఆమె కుటుంబ సభ్యులు జైలులో కల్వవడానికి రావడం మానేస్తే, జైలు సందర్శకుల హోదాలో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి దురభిప్రాయాన్ని తొలగించి వారి మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి కృషి చేయండి
ఈ క్రింది సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ సమయం, చొరవ తీసుకోవాల్సి రావొచ్చు.
మహిళా ఖైదీలను అర్థవంతమైన, సృజనాత్మకమైన పనులలో నిమగ్నం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు లేకపోతే, అలాంటి సేవలను అందించడానికి జైళ్ళ యంత్రాంగానికి సహాయం చేయండి.
ఇప్పుడున్న వేతనాలు చెల్లించే పద్ధతి గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకోండి. అందులో ఏవైనా సమస్యలుంటే వారితో చర్చించండి. సహకార బ్యాంకులలో అకౌంటు తెరచి, ఖైదీల సంపాదన దానిలో జమపడేలా జైళ్ళ అధికారులకు సహాయం చేయండి.
మహిళా ఖైదీలు ఎదుర్కొనే మరోక సమస్యేమిటంటే, ప్రొబేషన్ క్రింద విడుదలకు వారు అర్ హులైనప్పటికి, తగిన గార్డియన్లు లేకపోవడంతో ఆ ప్రయోజనాన్ని వారు పొందలేక పోతున్నారు. మహిళాఖైదీల పట్ల ఉన్న దురభిప్రాయాల వల్ల కుటుంబసభ్యులు ఈ ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడమే దీనికి ముఖ్యకారణం. మహిళాఖైదీలలో ఎంతో మార్పు వచ్చినా, ప్రొబేషన్ చట్టంలోని అన్ని నియమాలను వారు పాటించినా ఈ కారణంగానే విడుదల కాక తీవ్రమైన కష్టాలకులోనవుతున్నారు.
అర్హులైన మహిళా ఖైదీలందరికీ గార్డియన్ గా ఉండడానికి ఇండోర్ లో కస్తూర్బాగాంధీ ట్రస్టు ముందు కు వచ్చింది. అన్ని రాష్ట్రాల్లోను ఇటువంటి ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. వివరాలకోసం ఈ ట్రస్టు సంయుక్త కార్యదర్శి రాదాభట్ ను సంప్రదించవచ్చు.
విడుదలైన తర్వాత వెళ్ళడానికి ఎవరూ లేని మహిళా ఖైదీలకు కొంతకాలం పాటు సాంఘికంగా, ఆర్థికంగా అండగా ఉండేందుకు యాక్షన్ ఎయిడ్ భాగస్వామ్య సంఘాలను ఒప్పించే ప్రయత్నం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాల కోసం యాక్షన్ ఎయిడ్ ను సంప్రదించండి.
నేషనల్ కమిషన్ ఫర్ విమన్ చట్టం, (1990)లోని సెక్షన్ 10(1)(K) ప్రకారం, జైళ్ళను, రిమాండ్ హోంలను, మహిళలను ఖైదీలుగా ఉంచే ఇతర సంస్థలను, స్థలాలను సందర్శించి, అవసరమైతే సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన పరిష్కార చర్యలను చేపట్టాల్సిన బాధ్యత మహిళా కమిషన్ కు ఉంది. జాతీయా మహిళా కమిషన్, మధ్యప్రదేశ్ మహిళలు ఉన్న జైళ్ళను సందర్శించి సంబంధిత ప్రభుత్వాలకు చాలా సిఫారసులను చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా జైలు సందర్శకులకు తన పనిలో భాగస్వామ్యం కూడా కల్ఫించింది.
మహిళా సాధికారితపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ, తన మూడవ నివేదికలో, మహిళా ఖైదీల పరిస్థితులు మెరుగు పరచడానికి సిఫారసులు చేసి, వాటి అమలును పర్యవేక్షిస్తున్నది. సందర్శకులు తమ ప్రశ్నలను, ఫిర్యాదులను, సూచనలను, ఈ కమిటీకి నివేదించ వచ్చు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేటివ్ అండ్ చైల్డ్ డెవలఫ్ మెంట్ (NIPCCD). మహిళా, శిశు అభివృద్ధి డిపార్టుమెంట్ లో (భారత ప్రభుత్వం) ఇది ఒక స్వతంత్ర సంస్థ. దీనికి దేశ వ్యాప్రంగా ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ పరిధిలో మహిళా ఖైదీల సమస్యలు లేనప్పటికీ, మహిళా ఖైదీల సమస్యలను పరిష్కరించడానికి ఈ సంస్థను సమర్థవంతంగా ఉపయోగించ వచ్చు.
యునైటేడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ఫండ్ ఫ్ర్ విమెన్ (UNIFEM),ఇండియా. ప్రస్తుతానికి మహిళా ఖైదీలు ఈసంస్థ అజెండాలో లేనప్పటికీ సందర్శకులు, మహిళాఖైదీల గురించి పనిచేసే ఇతరులు తప్పకుండా దీనిని సంప్రదించి, మహిళాఖైదీల సమస్యలపై వారు కూడా పని చేసేలా చేయాలి.
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020