మానవహక్కుల ఉల్లంఘనలను సరిదిద్దడం
అనుచితమైన, అన్యాయమైన, అనైతికమైన, చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో మనందరం ప్రవర్తించే ఉంటాం. చట్టం నుంచి తప్పించు కున్నంత మాత్రాన, మనలో ఎవ్వరూ నైతికంగా గొప్పవారని చెప్పుకోలేరు. ఉద్దేశ్ పూర్వకంగా చేసే తప్పులే కాక, మనకు తెలియకుండా కూడా ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఇతరులలోని తప్పులను, లోటుపాట్లను నిర్మాణాత్మకంగా ఎత్తి చూపి, తమ ప్రవర్తనను సరిచేసుకునే అవకాశాన్ని భవిషత్తులో అలాంటి ప్రవర్తనను పునరావృతం చేయకుండా అవకాశాన్ని ఇవ్వాలి. మన దృక్పథం సరిదిద్దేదిగా ఉండాలేకాని, ప్రతీకారాత్మకంగా ఉండ కూడదు.
తీహార్ జైలులో 6 సంవత్సరాలు పని చేసిన ఎయిడ్స్ అవేర్ నెస్ గ్రూపు (AAG)తమ అనుభవం ఆధారంగా రెండు సూచనలు చేశారు.
- జైళ్ళ సిబ్బంది సహకారంతో పని చేస్తేనే జైలు సందర్శకులు విజయం సాధించగలరు.
- సాధ్యమైనంతవరకు సందర్శకుల లక్ష్యం మానవహక్కుల ఉల్లంఘనలను సరిదిద్దడమే తప్ప, దానికి బాధ్యులైన వారిని శిక్షించడం మాత్రమే కాదు.
- జైలుసిబ్బంది పాల్పడే మానవహక్కుల ఉల్లంఘన, ఇతర అక్రమాల విషయంలో అనుసరించే వ్యూహం, మనకు సూచిస్తున్న వ్యూహం ఈకింది విధంగా ఉంది.
- మొదటగా నిత్యం పోట్లాడే ధోరణి మంచిది కాదు.
- తప్పుచేసిన జైలు అధికారి ప్రవర్తన వల్ల జరిగే అన్యాయం గురించి, అది బయటపడడం వల్ల వచ్చే చట్టపరమైన పరిణామాల గురించి వివరించండి.
- అధికారి వినడానికి నిరాకరిస్తే తన ప్రవర్తనను మార్చుకోక పోతే, జరిగిన హానిని సరిదిద్దకపోతే, పాత ప్రవర్తనను కొనసాగిస్తే అతని /ఆమె పై అధికారికి చెప్పండి.
- ఆ తర్వాత తప్పుచేసిన అధికారిపై9 పై అధ్జికారులు చర్యలు తీసుకున్నారేమో గమనించండి.
- ఎటువంటి చర్య తీసుకోకపోతే, ఆపై అధికారితో సమస్యను చర్చించండి.
- ఉన్నతాధికారులతో చర్చించేటప్పుడు, మొదట హక్కులను ఉల్లంఘిస్తున్న అధికారి పేరు, బాధిత ఖైదీజ్ పేరు గోప్యంగా ఉంచండి. సమస్యను మాత్రమే చర్చించడం వల్ల తొందరపడి ఎవరి మీదా చర్య తీసుకునే ప్రమాదం ఉండదు.
- అధికారిని అనవసరంగా భయపెట్టకుండా ఉండడానికి మొదట సమస్యను జైలు పరిధిలొనే ఉంచండి. సరియైన స్పందనగాని, సరిదిద్దే చర్యలుగాని చేపట్టక పోతే, అప్పుడు మాత్రమే బయటి సంస్థలకు తెలియ జేయండి.
- ఈ పద్ధతిలో పని చేయడం వల్ల మంచిస్పందన వచ్చినట్టు AAG చెబుతున్నది. చాలా సందర్బాలలో సమస్య అదే రోజు సాయంత్రానికల్లా జైలు లోపలే పరిష్కారమౌతుంది కూడా.
- జైలు అధికారులతో పనిచేయడం రగురించి, వీలైనంత ఎక్కువగా వారి సహాకారం పొందడం గురించి AAG క్రింది చర్యల సూచిస్తున్నది.
- ఖైదీలతో మాట్లాడినప్పుడు జైలు భద్రతకు క్రమశిక్షణకు భంగం కలిగించగలమనిపించే విషయాలుగాని, సంఘటనలు గానెమ్ మీ దృష్టికివస్తే వాటిని – అధికారులకు తెలియజేయండి. ఇది మీ పట్ల అధికారులలో విశ్వాసాన్ని, నమ్మాఅన్ని ఏర్పరుస్తుంది.
- అయితే మీకు సమాచారాన్ని ఇచ్చిన ఖైదీ ఇబ్బంది పడకుండా ఉండడానికి అతని పేరును గోప్యంగా ఉంచండి. ఖైదీలు మిమ్మల్ని విశ్వసిస్తే, మీరు వారికి మద్దతు ఇస్తారని భావిస్తేనే, వారికి మీరు సహాయపడే అవకాశం, వ్యవస్థకు సంస్కరణ తెచ్చే అవకాశం పెరుగుతాయి.
- చిన్న చిన్న విషయాలపై ఫిర్యాదులు చేయకండి.
- జైలు సిబ్బంది చెప్పేక్ ఇబ్బందుల్ని, సమస్యలను కూడా వినండి. వారి విశ్వాసాన్ని పొందితే, సహకారంతో ఇద్దరూ కలిసి ఎక్కువ పనులు చేయడం సాధ్యపడుతుంది.
- మీకున్న నైపుణ్యన్ని జైలు అధికారులతో పంచుకోండి. అది విశ్వాసాన్ని పెంచడానికి, సహకారానికి దారితీస్తుంది. ఉదాహరణకు AAG జైలు సిబ్బందికి, కమ్యూనికేషన్ స్కిల్ ను, ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు, ఒత్తిడిని తగ్గించుకునేందుకు శిక్షణ ఇస్తుంది.
- ఇలాంటి పద్దతుల ద్వారా, జైలు అధికారులు స్పందిచి, సహకరించి, బాధ్యాతాయుతంగా మారతారని AAG అనుభవం చెబుతున్నది.
గుర్తు పెట్టుకోండి
సరిదిద్దేందుకు సహాయం చేయలేనప్పుడు ఊరికే విమర్శించకండి
- జరిగిన ఉల్లంఘనకు శిక్షించడం మీదకాక సరిదిద్దడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
- హక్కుల ఉల్లంఘన చేసిన వారు భవిష్యత్తులో అలా ప్రవర్తించకూడదంటే శిక్ష మాత్రమే సరిపోదు. అలాంటి ప్రవర్తనకున్న మూలకారణాలను మనం పట్టించుకోనంత కాలం, అది భవిష్యత్తులో జరగకుండా మనం ఆపలేం.
- అలాంటి ఉల్లంఘనలు జరగకుండా ఉండే వాతావరణాన్ని కల్పించేందుకు సహాయం చేయండి.
- కష్టతరమైన, ఒత్తిడితో కూడిన పరిస్థితులను తట్టుకోవడానికి విపాసనా ద్యానం జైలు అధికారులకు ఉపయోగపడింది. తమ తప్పులు తెలుసుకోడానికి, తమ ప్రవర్తన మార్చుకోడానికి, మానవ విలువల పట్ల గౌవరం పెంచడానికి కూడా విపాసన ఉపయోగపడింది.
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.