శిక్షపడిన ఖైదీలు – జైల్లో ఉన్నప్పుడు, విడుదలైన తర్వాత కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ అధ్యాయం అటువంటి కొన్ని సమస్యలను పరిశీలిస్తుంది.
రెమిషన్ కు సంబంధించిన, శిక్ష పూర్తికాక ముందే విడుదలయ్యే అవకాశాలకు సంబంధించిన నియమాలు, పద్ధతులు –వేరు వేరు రాష్ట్రాలకు వేరు వేరుగా ఉన్నాయి. ఈ నియమాలు కొన్ని రాష్ట్రాల మధ్యన అయితే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అందువల్ల శిక్షపడిన ఖైదీలు రెమిషన్ పొందడంలోనూ, శిక్ష పూర్తికాక ముందే విడుదలయ్యే – ప్రొబేషన్ , పెరోల్ సౌకర్యాలలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
1978 సి.ఆర్.పి.సి.ని సవరిస్తూ చేర్చిన సెక్షన్ 433ఎ కూడా శిపడిన ఖైదీల సమస్యను మరింత జటిలం చేసింది. ఈ సెక్షన్ ఏం చెబుతుందంటే .. “సెక్షన్ 432లో ఏమున్నప్పటికీ, మరణశిక్షకూడా ఒక శిక్షగా ఉన్న ఏ నేరంలో నైనా, యావజ్జీవ కారాగార శిక్ష పడినా; ఒకవేళ ఎవరికైనా మరణ శిక్ష విధించి మళ్ళీ సెక్షన్ 433 ప్రకారం యావజ్జీవంగా మార్చినా – అటువంటి ఖైదీని కనీసం 14 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించకుండా వదిలి పెట్టడానికి వీలులేదు.”
జైళ్లలో ఉండే వాస్తవ పరిస్థితులను గమనంలోకి తీసుకోకుండా, తమను తాము సంస్కరించుకునే ఖైదీల శిక్తిని గమనించకుండా, ఒక ఖైదీ అంతకాలం జైల్లో ఉండడం వలన జరిగే సామాజిక, వ్యక్తిగత ప్రమాదాలను దృష్టిలో పెట్టుకోకుండా, అంతకాలం ఒక ఖైదీని జైల్లో పెట్టినందువల్ల అయ్యే ఖర్చును కూడా లెక్కచేయకుండా చాలా తొందరపాటుతో ఈ సవరణను తీసుకొచ్చారు.
దీర్ఘకాలిక నిర్బంధం వలన ఎటువంటి ఉపయోగం లేకపోగా అది అనేక దుష్ఫలితాలకు దారి తీస్తుందని- జైళ్ళ మీద పరిశోధన చేసిన అనేకమంది నిపుణులతో పాటు గాంధీ, నెహ్రూలుల్ సైతం అభిప్రాయ పడ్డారు.
దీర్ఘకాలం జైలులో ఉండడం వలన ఖైదీలు ఏ రకంగానూ సంస్కరింపబడకపోగా, బయటకొచ్చాక పునరావాసం లభించక, సాంఘిక జీవనంలో మళ్ళీ కలిసిపోవడం వారికి చాలా కష్టమవుతుంది. ముల్లా కమిటీ కూడా ఈ సెక్షన్ (433ఎ) పన చాలా గట్టిగా మాట్లాడింది. వెంటనే తొలగించమని సిఫారసు చేసింది.
దీనిపై జాతీయ మానవహక్కుల కమీషన్ అన్ని రాష్ట్రాలకు వర్తించేలా ఒక ఉత్తర్వును తయారు చేస్తూ ఉంది. ఇంకా వివరాలు కావాలంటే చమన్ లాల్ గారిని కలవండి. చమన్ లాల్ గారు – కస్టోడియల్ జస్టిస్ ప్రోగాంకు కమిషన్ నియమించిన ప్ర్తత్యేక అనుసంధాన కర్త.
మరో సమస్య ఏమంటే.. అప్పీల్స్ లో హైకోర్టులో జరిగే విపరీతమైన జాప్యం. కేసు నెంబర్ కాలాలంటేనే హైకోర్టు రిజిస్ట్రీ లో చాలాకాలం పడుతుంది. ఒక్కోసారి హైకోర్టులు ఒక కేసును పరిష్కరించ డానికి 10 సంవత్సరాలు కూడా తీసుకుంటాయి.
విడుదలైన తర్వాత కూడా చాలామంది ఖైదీలు సమాజం నుంచి చాలా వ్యతిరేకతను ఎదుర్కొంటారు. సమాజం వాళ్ళను అనుమానంగా చూస్తుంది. పోలీసులు వాళ్ళను జీవితాంతం నేరస్తులగా చూస్తూ, వేధిస్తూ ఉంటారు. అందరి ఎత్తిపొడుపు మాటలు, వేధింపులు కలిసి నేర జీవెతం నుంచి సాధారణ జీవితంలోని రావడానికి వారికి అవరోధాలుగా ఉంటాయి.
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020