జైలు మాన్యువల్ ఏమి చెబుతుంది?
- ప్రతి ఒక్క సందర్శకుడు తన జైలు సందర్శన పూర్తి చేసిన తర్వాత జైళ్ళ చట్టం 1894 లోని సెక్షన్ 12 ప్రకారం సందర్శకుల పుస్తకంలో జైలును సందర్శించిన సమయం, తారీఖు నమోదు చేయాలి. ఏవైనా ఫిర్యాదులు లేక సూచనలుంటే వాటిని కూడా పేర్కొనాలి.
- సందర్శకుల పుస్తకంలో తమ స్వంత చేతి వ్రాతతోనే తమ అభిప్రాయం రాయాలి.
- ప్రభుత్వం దృష్టికి తేవాల్సిన ఫిర్యాదులు ఏవైనా ఖైదీలు చేస్తే వాటిని కూడా సందర్శకులు ఈ పుస్తకంలో నమోదు చేయాలి85.
- జైలులో ఖైదీల జీవన పరిస్థితుల గురించి, అంతర్గత క్రమశిక్షణ గురించి సూచనలు, ఫిర్యాదుల్ని కూడా సందర్శకులు నమోదు చేయవచ్చు.
సాధారణ మార్గదర్శకాలు గుర్తుపెట్టుకోండి
జైళ్ళ పరిస్థితులలో వాస్తవంగా మార్పును తేవడానికి, తప్పులను ఎత్తి చూపడమే కాక, ఆచరణాత్మక పరిష్కారాల కోసం ప్రయత్నించడం కూడా ముఖ్యం. ఈలక్ష్యం దృష్ట్యా రాసుకున్న నోట్స్ ను భద్రపరచు కోవడం కూడా అవసరమే సందర్శకులు క్రమం తప్పకుండా తమ అభిప్రాయాలను రాయాలి. జైలులో ప్రవేశించిన, బయటకు అప్పటికప్పుడే రాసి ఉంచుకోవాలి.
1. సమస్యలను గుర్తించడం, వాటికి వాస్తవమైన కారణాలను, సాద్యమైన పరిష్కారాలను కూడా నమోదు చేయాలి.
2. తమ నోట్స్ ను నిర్ధిష్టమైన సమస్యలపై సమగ్రంగా రాయడం మంచిది. జైళ్ళ పరిస్థితుల గురించి అనిర్ధిష్ట్టంగా ఏదో ఒకటి రాసుకుంటూ పోకూడదు.
3. “జైలులో పరిస్థితి ఫర్వాలేదు” లాంటి వాక్యాలు జైలులోని సమస్యల గురింకిచి ఏమీ చెప్పవు.
4. ఇంగ్లాండ్ లోని ఎర్ల్ స్టోక్ జైలుపై జైలు సందర్శకులు ఇచ్చిన సంవత్సరాంతపు నివేధిక ఈ అధ్యాయానికి అనుబంధంగా ఇవ్వబడినది. మంచి నివేధికకు ఇది ఒక ఉదాహరణ. ఈ నివేదికను వారు ఒక పద్ధతి ప్రకారం, సంయమనంతో ఆశావాద దృక్పథంతో రాశారు. సందర్శకుల బోర్డు, మంచి పరిణామాలను ఎత్తి చూపింది. జైలు సిబ్బంది నిజాయితీతో చేసిన ప్రయత్నాలను అభినందించి, వారిని ప్రోత్సహించింది. జైళ్ళ సిబ్బంది చేస్తున్న పనికి మద్దతిస్తూ, అదే సమయంలో ఖైదీల పట్ల అనుసరించాల్సిన ప్రమాణాలతో రాజీపడకుండా, సమస్యలను స్పష్టంగా, ఖచ్చితంగా ఎత్తిచూపితే, వాటికి కావలసినంత ప్రాధాన్య్తత దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది
జైలు డైరీని నిర్వహించడమెలా?
- జైలు సందర్శకుల పుస్తకంలో నమోదు చేసిన విషయాలను, తమ వ్యక్తిగత రికార్డులలో రాసి ఉంచుకుంటే సందర్శకులు తమ అధికార విధులను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించుకో గలుగుతారు. ప్రభుత్వం సందర్శకుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కూడా ఇది పనికి వస్తుంది.
- జైలుకు వెళ్ళిన తారీఖు ఎదురుగా ఆ రోజు గమనించిన అన్నిఅంశాలనూ నమోదు చేయాలి. అందులో తాము గమనించిన సమస్యలు,వాటి కారణాలు, తాము సూచించిన పరిష్కారాలు అన్ని ఉండాలి. ఏ అధికారికి సూచనలు చేశారో వారి పేరు నమోదు చేయాలి.
- జైలు అధికారులుగాని తాముగాని చేపట్టిన తదుపరి చర్యలను కూడా నమోదు చేయాలి.
వాటిపై తదుపరి చర్యలు (fallow –up)
ఊరకే అంశాలు నమోదు చేయడం సరిపోదు. మీరిచ్చిన సూచనలు అమలులో ఎంత పురోగతి జరిగిదో మీ తర్వాతి సందర్శనలో తెలుసుకోండి. పరిష్కారాల వెతకడంతో వారి తోడ్పాటు కూడా తీసుకోండి.కానీ అవసరమైనప్పుడు సమస్యను పరిష్కరించడంలో ఉన్నతాధికారులతో దృఢంగా వ్యవహరించండి. నిరంతరం కొనసాగిస్తూ మీపనిపట్ల స్థిరంగా ఉంటే మిమ్మల్ని వాళ్ళు ఖచ్చింతంగా పట్టించుకోరు
- జైలు ప్రధానాధికారి,ఇన్ స్పెక్టర్ జనరల్ మీ ప్రయత్నాలను బలపరచవలసి ఉంటుందని జైలు మాన్యువల్ స్పష్టంగా పేర్కొంది. జైలు రూలు 33 ఇలా అంటుంది.
- దానిపై ప్రభుత్వం లేక ఇన్ స్పెక్టర్ జనరల్ నుండి ఏదైనా అదేశాలు వస్తే అవి జైలు ప్రధానాధికారీ ద్వారా జైలు సందర్శకునికి పంపించాలి.
- ప్రభుత్వ ఆదేశాలు రాకపోయినా, మీ అభిప్రాయాల్ని గట్టిగా పట్టించుకోక పోయినా గతఅధ్యాయం చివర లో పొందుపరచిన అధికారులను, సంస్థలను మీరు సంప్రదించాలి.86 సంప్రదించే ముందు, సమస్యకున్న మూల కారణాన్ని నిర్ధారించడం, దానికి వ్యక్తిగతంగా ఎవరు బాధ్యులో తెలుసుకోవడం ముఖ్యం. ఖైదీల రద్దీ (over crowding), విచారణ ఖైదీల కేసుల విచారణలో జరిగే ఆలస్యం లాంటి సంస్థాగత సమస్యలు జైళ్ళ అధికారుల పరిధిలో లేవని గ్రహించి, సంబంధం లేని వారిని నిందించడంలో సమయాన్ని వృధా చేయకుండడం చాలా ముఖ్యం
బయట సంస్థలను సంప్రదించే ముందు ఆ విషయాన్ని జైళ్ళ అధికారులకు తెలియజేయాండి. ఇది అధికారుల స్పందనను మెరుగు పరుస్తుందేమో గమనించండి. మెరుగు పరచకపోతే మాత్రం ఆలస్యం చెయ్యకుండా 7వ అధ్యాయంలో పేర్కొన్న అధికారులను, సంస్థలను సంప్రదించండి.
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్