অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సహాయం చేయగల వ్యక్తులు, సంస్థలు

ఈ అధ్యాయంలో జైళ్ళతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధముండి పని చేస్తున్న వ్యక్తుల, సంస్థల వివరాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో ఏ అభివృద్ధ్జి కరమైన పని ప్రారంభించాలనుకున్నా వీరి సహాయం పొందవచ్చు. మీరు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు పొట్టకూటి కోసం నేరాలు చేసే వాళ్ళ సంఖ్యను తగ్గించే విధంగా ఉండాలి. దాంతో పాటు మాజీ ఖైదీల పునరావాసానికి కూడా వీరి సహాయాన్ని తీసుకోవచ్చు.

సందర్శకులు తప్పకుండా- డాక్టర్లతో, సైక్రియాట్రిస్ట్ లతో, లాయర్లతొ, సామాజిక కార్యకర్తలతో సంబంధాలు పెట్టుకోవాలి. స్త్రీల – అభివృద్ధికి కృషి చేసే పర్యావరణం, స్వయం ఉపాధి, నిర్వహించే తదితర కార్యక్రమాలకి పాటుపడే సంస్థలను గుర్తించి వారిని – జైళ్ళ, ఖైదీల, ఖైదీల కుటుంబాల, బాధితుల కుటుంబాల కోసం ఎలా ఉపయోగించు కోవచ్చో ప్రణాళికకు రూపొందించుకోవాలి..

మాకు (CHRI)తెలిసిన సంస్థల, వ్యక్తుల వివరాలు ఇస్తున్నాం. మీకు తెలిసినవి ఇంకేమైనా ఉంటే మాకు తెలియజేయండి.

జైళ్ళ సమస్యలపై ప్రత్యక్షంగా పని చేస్తున్న వ్యక్తులు, సంస్థలు

ప్రొ|| బి.బి.పాండే :  క్రిమినల్ లా, క్రిమినాలజీ బోధకుడు   క్యాంపస్ లా సెంటర్,   ఢిల్లీ యూనివర్సిటీ. వీరి తీహార్ జైల్లోని బీద ఖైదీలకు  న్యాయసహాయం అందజేసే ఒక ప్రాజెక్టు నడిపారు. అట్లే బెగ్గర్ కోర్ట్స్ పేరుతో పేద ప్రజలకు చట్టాల మీద అవగాహన కల్పించారు. వీరు ఈ కార్యక్రమాలను లా విర్యార్థుల సహాయంతో చేశారు. డా|| హీరా సింగ్ :లక్నో యూనివర్సిటీలో, సోషల్ వర్క్ విభాగంలో లెక్చరర్ గా మొదలుపెట్టి, తరువాత జైల్ సూపరింటెండెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ లో డైరెక్టర్ గానూ, జాతీయ మానవహక్కుల కమీషన్ కు కన్సల్టెంట్ గానూ పని చేశారు. వీరు ముల్లా కమిటీలో కూడా సభ్యులు. డా|| సింగ్ జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన జైళ్ళు నిపుణులు. మంచి అనుభవ జ్ఞానం కూడా ఉన్నది.
డా|| కె.కె.గుప్తా ప్రస్తుతం: సూపరింటేండెంట, సెంట్రల్ జైల్ అంబికాపూర్ , చత్తీస్ గఢ్ గతంలో బిలాస్ పూర్ సెంట్రల్ జైలులో పనిచేస్తున్నప్పుడు బిలాస్ పూర్ కలెక్టర్ గా పనిచేసిన హర్షమందర్ గారితో కలిసి జైలులో పారదర్శక పాలన ప్రవేశపెట్టిన కీర్తి వీరికే దక్కుతుంది.జైలులోపల ఉన్న మహిళా ఖైదీల పిల్లల చదువుకోసం జైలు బయట ‘అభియాన్ ‘ అనే ఎన్.జి.వో చేత ఒక స్కూలు పెట్టడాన్ని ప్రోత్సహించారు ఎమ్.ఎమ్.ఉపాధ్యాయ :కలెక్టర్, జబల్ పూర్,
1994లోనే జబల్ పూర్ సెంట్రల్ జైలులో జైలు అదాలత్ ను నిర్వహించడానికి పూనుకున్నారు. మంచి అధికారిక సందర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
మన్ శరమ్ అల్లే :  సెంట్రల్ జైలు,    రేవా, మధ్యప్రదేశ్ రేవా సెంట్రల్ జైలులో ఐదు అంచెల కార్యక్రమాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఖైదీల విద్య, పునరావాసం కూడా భాగంగా ఉంటాయి. ఖైదీలకు, జైలు సిబ్బందికి కూడా బోధించే వారు. కుమారి మిరియమ్ థామన్:    న్యాయవాది,   మాండ్ల, మధ్యప్రదేశ్ వీరు న్యాయవాదే కాక నిబద్దతకల సామాజిక కార్యకర్త కూడా ఈమెకు ఖైదీలతో, ఆధివాసులతో పని చేసిన విస్తృతమైఅన్ అనుభవం ఉంది. వారి తరపున అనేక కేసులు వాదించారు కూడ.
ఎస్ ఎమ్ గోయెంకా వీరు మధ్యప్రదేశ్ లోని కొన్ని జైళ్ళలో విపాసన అనే ధ్యాన పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికి వీరు ఎటువంటి రుసుము తీసుకోరు మధ్యప్రదేశ్ లోని కొన్ని జైళ్ళలో ఈ కార్యక్రమం విజయవంతం అయింది. కాబట్టి ప్రస్తుతం కేంద్ర హోమ్ శాఖ దీన్ని దేశంలోని అన్ని జైళ్ళకు వర్తింపచేయాలని ప్రయత్నిస్తూ ఉంది శ్రీమతి శాలినీ థాయ్ మోఘే (పద్మశ్రీ):
వీరు ఇండొర్ లో బాల్ నికేతన్ సంఘ్ అనే సంస్థను ఏర్పాటు చేసి, జైళ్ళలో ఉండే పిల్లల కోసం పనిచేస్తున్నారు
యాక్షన్ ఎయిడ్ ఇండియా; దేశ వ్యాప్తంగా అభివృధి కార్యక్రమాలు చేస్తున్న 300 స్వచ్ఛంద సంస్థలకు సహాకారం అందిస్తున్న ఫండింగ్ ఏజన్సీ, దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నస్త్రీలు,దళితులు, పిల్లలు;కరువుతో బాధపడుతున్నవాళ్ళు; ఆధివాసులు; ఆశ్రయం లేకుండా వీధుల్లో బతికేవారు; జైళ్ళలో ఉన్న స్త్రీలు, యువకులు ఆశ్రయం లేకుండా వీధుల్లో బతికేవారు; జైళ్ళలోఉన్న స్త్రీలు,యువకులు – తదితరుల కోసం ముఖ్యంగా పనిచేస్తుంది.
జాతీయ మానవహక్కుల కమీషన్ కోరగా యాక్షన్ ఎయిడ్ వారు జైళ్ళలో ఒక అధ్యయనం చేశారు. యాక్షన్ ఎయిడ్ రెజనల్ ఆఫీసులు చాలా రాష్ట్రాల రాజధానుల్లో ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా ఉంది.
ఎయిడ్స్ అవేర్ నెస్ గ్రూప్ (AAG):
ఈ సంస్థ గత 8 సంవత్సరాలుగా తీహార్ సెంట్రల్ జైల్ లో పనిచేస్తూ ఉంది
డిపార్టు మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (DFID)
ఇది ఇంగ్లాండ్ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. దీని కార్యాలయం ఈ మధ్య ఇండియాలో కూడా పెట్టారు. ఈ సంస్థ నేర న్యాయవ్యవస్థలో వ్యవస్థాగత సంస్కరణలు అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది
ఇండియా విజన్ ఫౌండేషన్ 1994లో కిరణ్ బేడీ ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఈ సంస్థ జైళ్ళ సంస్కరణ; ఖైదీల పిల్లలకు విద్య; పట్టణ మురిగి వాడల్లో విద్య; మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలన; నేర నివారణ, పోలీసుల సంస్కరణ; మహిళా సాధికారత – తదితర లక్ష్యాలతో పనిచేస్తున్నది
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ప్రిజన్ స్టడీస్ (ICPS):
కింగ్స్ కాలేజి లండన్ లో ఈ సంస్థ ఉంది. ఈ సంస్థ జైళ్ళలో అనుసరణీయ విధానాలు, బందిఖానాకు ప్రత్యామ్నాయాలు అనే అంశాలలో ప్రభుత్వాలకు సంబంధిత ఇతర సంస్థలకు సలహాలు ఇస్తుంది. ఖైదీలలో టి.బి. నివారణ, బంధిఖానాకు ప్రత్యామ్నాయాలు, జైలు సిబ్బందికి మానవ హక్కులపై శిక్షణ తదితర ప్రాజెక్టులను, స్వయంగా జైళ్ళలో చేపట్టింది.
నవ జీవన్ మండల్ ఇది మహారాష్ట్రలోని పూణెలో ఉంది. ఖైదీల పునరావాసం కోసం పనిచేసే సంస్థలలో ఇది చాలా ముఖ్యమైనది.  రెటైర్ అయిన పోలీసులు, జైలు సిబ్బంది, సామాజిక కార్యకర్తలు సంస్కరింపబడిన ఖైదీలు ఈ సంస్థలో సభ్యులుగా ఉంటారు.
ఫీమ రొఫార, ఇంటర్ నేషనల్ (PRI):
ఇది ఒక ప్రభుత్వేతర సంస్థ. శిక్షలను సంస్కరించే లక్ష్యంతో 80 దేశాలలో పనిచేస్తూ ఉంది. వివిధ దేశాలలో అనుసరిస్తున్న శిక్షలను, అవి అమలు చేస్తున్న పద్ధతులను అధ్యయనం చేసి బందిఖానాకు ప్రత్యామ్నాయాలను సూచిస్తుంది.
పీనల్ రిఫార్మ్ అండ్ జస్టిస్ అసోసియేషన్ (PRAJA):
హర్యానాలోని గుర్ గావ్ లో ఉన్న ఈ సంస్థ పీనల్ రిఫార్మ్ ఇంటర్ నేషనల్ సంస్థకు సోదర సంస్థ. ఇది ప్రస్తుతం రాజస్తాన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ సంస్థ  మహిళా ఖైదీలలో అవసరమైన వారికి మానసిక చికిత్స, అలాగే వాళ్ళ  పిల్లల సంరక్షణ పైన కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉన్నది. జైలు శిక్షలకు బదులు సమాజ సేవ అనే పద్దతిని ఆంధ్రప్రదేశ్ లో పరిచయం చేయాలని కృషి చేస్తూ ఉన్నది.
ప్రయాస్: ఈ సంస్థ ముంబాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఈ సంస్థ పేద ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తున్నది. అలాగే జైలు నుంచి విడుదలైన వచ్చిన ఖైదీలకుసాంకేతిక శిక్షణను ఇప్పించి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించడంలొ కూడా కృషి చేస్తున్నది. ఈ సంస్థ సిబ్బంది కోర్టులలో, పోలీస్ స్టేషన్లలో న్యాయ సహాయం అవసరమైన వ్యక్తులను గుర్తించి, వారికి న్యాయ సహాయం అందజేస్తారు. వీరు బాలనేరస్తుల కోసం కూడా ప్రత్యేకంగా పనిచేస్తూ ఉన్నారు. సాథి : ఈ సంస్థ మహారాష్టలోని పూణెలో ఉన్నది. ముఖ్యంగా ఎరవాడ జైలులోని మహిళా ఖైదీలకోసం, వాళ్ళ పిల్లల కోసం పని చేస్తున్నది. ఆరోగ్యం, విద్య, న్యాయ సహాయం తదితర లక్ష్యాలతో  పనిచేస్తున్నది.
సొసైటి ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ డెవలెప్ మెంట్ (SEED):
తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఇది. ముఖ్యంగా ఖైదీల పిల్లలకోసం పనిచేస్తుంది. వాళ్ళకు విద్య, వృత్తిపరమైన శిక్షణ, బయటనున్న చిన్న పిల్లలను అవసరమనుకుంటే జైలులో ఉన్న తల్లుల దగ్గరకి చేర్చడం తదితర లక్ష్యాలతో పనిచేస్తున్నారు.
సుధార్ (సోషల్ వర్క్ ఇన్ ప్రిజన్) :ఈ సంస్థ భోపాల్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. మహిళా ఖైదీల, యువ నేరస్తుల సంక్షేమం లక్ష్యంగా పని చేస్తున్నది. భోపాల్ లోఉన్న యాక్షన్ ఎయిడ్ సహాయ సహాకారాలతో  పనిచేస్తూ ఉన్నది.
ది అర్ట్ ఆఫ్ లివింగ్ పౌండేషన్ :దేశంలోని చాలా జైళ్ళలో ఖైదీలకు ధ్యానం పైన శిక్షణ నిస్తున్నారు.

సందర్శకులకు కొన్ని సూచనలు

  • ఈ సంస్థలు, వ్యక్తులు చేస్తున్న పనిలాంటిదే మీరు చేయాలనుకున్నప్పుడు, ఈ సంస్థల అనుభవాన్ని, సలయాలను, సహాయాన్ని తీసుకోవచ్చు.
  • మాఫియా ముఠాలను, రాజకీయ కక్షలు ఉన్నవారిని, అవినీతి కంట్రాక్టర్లను, పనిమీద శ్రద్ధలేని లాయర్లను మీరు చేస్తున్న పనిలో వినియోగించుకోవద్దు.
  • దాతల నుంచి జైళ్ళకోసం ఏవైనా వస్తువులు సేకరిస్తే అవి అందరికీ ఉపయోగ పడేవిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ఉదాహరణకు – ఫ్యాన్లు, టీవీలు, ఆట వస్తువులు, పుస్తకాలు, పలకలు, బలపాలు
  • దాతలెవరైనా ఇంకా సహాయం చేయడానికి ముందుకు వస్తే అర్హులకు బెయిల్ ఇవ్వమని; ఖైదీల పిల్లల చదువు కోసం సహాయపడమని కూడా అడగవచ్చు.

సందర్శకులు తీసుకోవలసిన జాగ్రత్తలు

  • జైలు అధికారుల ప్రాధమిక బాధ్యతలను మీపైన వేసుకోకూడదు.
  • జైలు సంస్కరణలలో వీలయినంత వరకు బయటి సమాజాన్ని భాగం చేయాలి.
  • జైలు సిబ్బంది తమ విధులను – సందర్శకులకు, ఎన్.జి.వో.లకు బదిలీ చేసేటంతగా, కలుగ జేసుకోకూడదు.
  • జైలు సిబ్బంది తమ విధులను మీమీద పెడుతున్నట్టు అర్థమయితే వెంటనే ఆ ధోరణికి అడ్డుకట్ట వేయండి. లేదంటే మీకు మీపని మరింత బరువవుతుంది. జైలు సిబ్బంది లో జవాబు దారీతనం నశించిపోతుంది

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate