অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భవిష్య నిధులకు (ప్రావిడెంట్‌ ఫండ్‌లకు) పెట్టుబడి అవకాశాలు

భవిష్య నిధులకు (ప్రావిడెంట్‌ ఫండ్‌లకు) పెట్టుబడి అవకాశాలు

ప్రభుత్వ సెక్యూరిటీలే ఎందుకు?

  • సహజంగానే భవిష్యనిధులను తగిన రాబడిని అందించడంతోపాటు నష్టభయం (రిస్క్‌) లేని సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. శ్రేష్టమైన (gilt edged) సెక్యూరిటీలు లేదా  జి-సెక్యూరిటీలుగా పేరుఎందిన ప్రభుత్వ సెక్యూరిటీలవల్ల నష్టభయం లేకపోవడమే కాకుండా అవి తగిన రాబడులను సమకూరుస్తాయి. అందువల్ల అవి - భవిష్యనిధులకు అత్యంత అనుకూలమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తాయి

ప్రభుత్వ సెక్యూరిటీలు ఏవి?

  • ప్రభుత్వ సెక్యూరిటీలలో  భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జారీచేసిన డేటెడ్‌ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులూ ఉంటాయి. ప్రభుత్వ ప్రతినిధిగా భారత రిజర్వ్‌ బ్యాంకు, వివిధ ప్రాంతాలలో ఉన్న తన ప్రజా ఋణ (public debt) కార్యాలయాల ద్వారా ఈ సెక్యూరిటీలను నిర్వహిస్తూ సేవలందిస్తుంది.

ట్రెజరీ బిల్లులు

రకాలు

  • ట్రెజరీ బిల్లులు (టి-బిల్లులు), స్వల్పకాలిక, సాధారణంగా ఒక సంవత్సరం వరకు, పెట్టుబడి అవకాశాలను సమకూరుస్తాయి. ఆ విధంగా అవి, స్వల్పకాలిక ద్రవ్యత్వాన్ని నిర్వహించడంలో ఉపయోగకరంగా ఉంటాయి.  ప్రస్తుతం, భారత ప్రభుత్వం, నాలుగు రకాల ట్రెజరీ బిల్లులను జారీ చేస్తూ ఉంది.  అవి ః 14-రోజులు, 91-రోజులు, 182-రోజులు, 364-రోజుల ట్రెజరీ బిల్లులు.

మొత్తం

  • టి-బిల్లులు, కనీసం రూ. 25,000/-లు  ఆ తరవాత రూ. 25,000/- గుణకాలలోని మొత్తానికి అందుబాటులో ఉన్నాయి. టి-బిల్లులను డిస్కౌంట్‌కు జారీ చేసి సమమూల్యానికి  విమోచనం (redeemed) చేయబడతాయి.

వేలంపాటలు

  • 14 - రోజులు, 91-రోజుల టి-బిల్లులను ప్రతి వారమూ శుక్రవారాలలో వేలం వేస్తూ ఉండగా 182-రోజుల, 364 రోజుల టి-బిల్లులను బుధవారాలలో వారం విడిచి వారం వేలం వేస్తారు. టి-బిల్లులను వేలం పాటకు సంబంధించి భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ఒక కాలెండర్‌ జారీ చేస్తుంది. ప్రతి వేలం పాటకు ముందుగానే ప్రతికా ప్రకటనలు జారీ చేయడం ద్వారా వేలం పాట కచ్చితమైన తారీఖున వేలం వేసే మొత్తాన్ని చెల్లింపు తారీఖును కూడా ప్రకటిస్తుంది.
టి-బిల్లుల రకం వేలంపాట రోజు చెల్లింపు తేదీ
14-రోజులు శుక్రవారం తరవాత వచ్చే శనివారం
91-రోజులు శుక్రవారం తరవాత వచ్చే శనివారం
182-రోజులు నాన్‌-రిపోర్టింగ్‌ వారంలోని బుధవారం తరువాత వచ్చే గురువారం
364- రోజులు రిపోర్టింగ్‌ వారంలోని బుధవారం తరవాత వచ్చే గురువారం
*చెల్లింపు తేదీన సెలవు రోజు అయినట్లయితే, సెలవు రోజుకు తరవాత రోజున చెల్లిస్తారు.

చెల్లింపు

  • విజయవంతమైన పాటదారుల 14 రోజుల, 91-రోజుల టి-బిల్లుల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులను శుక్రవారం వేలం తరువాత వచ్చే శనివారం చెల్లించాలి. 182-రోజులు, 364-రోజులు టి-బిల్లుల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులు విజయవంతమైన పాటదారులు, తరవాత వచ్చే గురువారం చెల్లించాలి. వేలంపాటలో విజయవంతమైన పాటదారులు, నగదు రూపంలోకానీ, భారతీయ రిజర్వ్‌ బ్యాంకు పేరిట  తీసుకొన్న చెక్కుద్వారా లేదా బ్యాంకర్‌ పే ఆర్డర్‌ ద్వారా చెల్లించవలసి ఉంటుంది.

పాల్గొనడం

  • భవిష్యనిధులు, పోటీలేని పాటాదారులుగా 14, 91-రోజుల టి-బిల్లుల వేలంలో పాల్గొనవచ్చు. పోటీలేని పాటదారులుగా 182-రోజులు, 364 రోజుల టి-బిల్లులను కొనుగోలు చేయడానికి ఇంకా భవిష్యనిధులను అనుమతించలేదు. పోటీలేని పాటదారులుగా పాల్గొనడం అంటే, ఈ బిల్లులను తాము కొనుగోలు చేయదలచుకున్న రాబడి రేటును భవిష్య నిధులు కోట్‌ చేయనవసరం లేదన్నమాట. వేలంలో అంగీకరించిన పోటీ పాటలు కోట్‌ చేసిన రాబడుల  ప్రాతిపదికమీద సాధించిన  వెయిటెడ్‌ ఆవరేజ్‌ యీల్డ్‌లో పోటీలేని పాటకారులకు రిజర్వు బ్యాంకు పాటల (బిడ్స్‌) ని కేటాయిస్తుంది.  పోటీలేని పాటదారులకు చేసిన కేటాయింపులు, అమ్మకానికి ప్రకటించిన మొత్తంలో కలవవు. మరోవిధంగా చెప్పాలంటే, వేలంపాటలద్వారా ఆశించిన టి-బిల్లుల మొత్తాన్ని కొనుగోలుచేయడంలో భవిష్యనిధులు,  ఏవిధంగా అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కోవు.

ఎక్కడ కొనుగోలు చేయాలి?

  • ముంబాయిలోని భారతీయ రిజర్వు బ్యాంకులో టి-బిల్లులు వేలం జరుగుతుంది. ఇందుకోసం భవిష్య నిధులు, నిర్ణీత ఫారంలో రిజర్వ్‌ బ్యాంకు  ముంబాయి కార్యాలయంలో తమ బిడ్‌లు సమర్పించవలసి ఉంటుంది.  ముంబాయికి వెలుపల ఉన్న భవిష్యనిధులు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, పబ్లిక్‌ అకౌంట్‌ డిపార్ట్‌మెంట్‌, భారత రిజర్వ్‌ బ్యాంక్‌, పోర్ట్‌, ముంబాయి-400 001 పేరిట ఫాక్స్‌ ద్వారాగానీ (నెం- 022-269 3332), ఇ-మెయిన్‌ ద్వారా గానీ తమ బిడ్‌లను ముందుగానే పంపాలి.

డేటెడ్‌ సెక్యూరిటీలు

  • ఒక సంవత్సరానికి మించిన వ్యవధిలో ఉన్న ప్రభుత్వ పత్రాన్ని  డేటెడ్‌ సెక్యూరిటీ అంటారు. ప్రస్తుతం మార్కెట్‌లో 20 సంవత్సరాల వరకు వ్యవధిగల డేటెడ్‌ సెక్యూరిటీలు ఉన్నాయి.

వేలంపాట / అమ్మకం

  • డేటెడ్‌ సెక్యూరిటీలను వేలంపాటల ద్వారా గానీ అమ్మకంద్వారాగానీ అమ్ముతారు. వాస్తవానికి, డేటెడ్‌ సెక్యూరిటీలో అమ్మకం లేదా వేలంపాట అంటే సెక్యూరిటీకి సంబంధించిన కూపన్‌ వేలం వేయడం గానీ స్థిరనిర్ణయించడం గానీ జరుగుతుంది. ఫిక్స్‌డ్‌ కూపన్‌ సెక్యూరిటీలను కూడా కొన్ని సందర్భాలలో కొన్ని రోజులపాటు ఓపెన్‌గా ఉంచి అమ్ముతారు.

ప్రకటన

  • ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకానికి సంబంధించి కాలెండర్‌ లేప్పటికీ భారత ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు కూడా అమ్మకాన్ని పత్రికా ప్రకటనల ద్వార తెలియ చేస్తాయి. పత్రికా ప్రకటనను ముద్రణ మాధ్యమంలోనూ, వైర్‌ ఏజెన్సీలోనూ విస్త్రుతంగా ప్రకటిస్తారు. ప్రముఖ ఫైనాన్సియల్‌  వార్తాపత్రికలలో భారత ప్రభుత్వం కూడా  ప్రకటన జారీ చేస్తుంది. వేలంపాటలు / అమ్మకాలు, వాటి ఫలితాల ప్రకటనలను రిజర్వ్‌ బ్యాంక్‌ వెబ్‌సైట్‌  లో కూడా ప్రచురిస్తారు.

మొత్తం

చందాలు కనీసం రూ. 10,000/-లలోనూ,  రూ. 10,000 గుణకాలలోనూ  ఉంటాయి.

అమ్మకాలు ఎక్కడ జరుగుతాయి?

  • వేలంపాటలనూ, అమ్మకాలనూ  సాధారణంగా ముంబాయిలోని భారతీయ రిజర్వు బ్యాంకులో నిర్వహిస్తారు. భవిష్యనిధులు, సెక్యూరిటీల వేలం/అమ్మకం సమయంలో  అందుబాటులో ఉంటే నిర్ణీత ఫారంలో  తమ  పోటీ పాటలను / దరఖాస్తులను చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌,  పబ్లిక్‌ డెట్‌ కార్యాలయం, భారతీయ రిజర్వు బ్యాంక్‌, పోర్ట్‌, ముంబాయి 400 001 (పాక్స్‌: 022-266 2721-022--266 0817) చిరునామాలో సమర్పించాలి.

చెల్లింపు

  • వేలంపాటల సందర్భంలో సాధారణంగా వేలం రోజు తర్వాతరోజున విజయవంతమైన పాటదారులు, చెల్లింపు చేయవలసి ఉంటుంది. ఫిక్స్‌డ్‌ కూపన్‌ / టాప్‌ అమ్మకాల సందర్భంలో , దరఖాస్తుతోపాటు చెల్లింపు చేయవలసి ఉంటుంది. ఈ చెల్లింపును నగదురూపంలోగానీ  భారతీయ రిజర్వు బ్యాంక్‌ పేరిట రాసిన చెక్కురూపంలోగానీ బాంకర్స్‌ పే ఆర్డర్‌  ద్వారా గానీ చేయవలసి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు

  • ఇవి రాష్ట్రప్రభుత్వాలు జారీ చేసే సెక్యూరిటీలు. ఈ జారీలను కూడా భారత రిజర్వ్‌బ్యాంకు నిర్వహించి సేవలందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల కాలవ్యవధి  సాధారణంగా పది సంవత్సరాలు. కనీసం రూ. 1000/-లకు, ఆ తరవాత ప్రతి 1000/-ల గుణకాలలో రాష్ట్రప్రభుత్వ సెక్యూరిటీలు లభిస్తాయి. ఇవి ఫిక్స్‌డ్‌ కూపన్‌ రేటుకి లభిస్తాయి. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, తమ సెక్యూరిటీలను వేలం వేయడం ప్రారంబించాయి. భారతీయ రిజర్వు బ్యాంకు, భారతీయ స్టేట్‌ బ్యాంకు, దాని  బ్యాంకుల కార్యాలయాల విస్త్రుత నెట్‌వర్క్‌ ద్వారా ఈ సెక్యూరిటీలను కొనుగోలు చేయవచ్చు.

ప్రభుత్వ సెక్యూరిటీల లభ్యత

  • వేలంపాటలు/అమ్మకాల ద్వారా భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడమే కాకుండా సెకండరీ మార్కెట్‌నుంచి కూడా అన్ని రకాల ప్రభుత్వ పత్రాలను కొనుగోలు చేయవచ్చు. గుర్తింపు ఎందిన ప్రాథమిక డీలర్‌లూ  శాటిలైట్‌ డీలర్‌లూ కూడా సెక్యూరిటీలను కొంటారు, అమ్ముతారు కూడా.
  • తన ఓపెన్‌ మార్కెట్‌ కార్యరూపాల విభాగం ద్వారా భారతీయ రిజర్వ్‌ బ్యాంకు సైతం  ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది. రిజర్వ్‌ బ్యాంకు ఓపెన్‌ మార్కెట్‌  కార్యరూపాల విధానంలో అందుబాటులో ఉండే సెక్యూరిటీల జాబితాను  ఎప్పటికప్పుడు భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేస్తూ, మంచి ప్రచారం కల్పిస్తుంది. రిజర్వ్‌ బ్యాంకు ఓపెన్‌ మార్కెట్‌ కార్యకలాపాల విధానంలో మ్మకానికి ఉంచిన సెక్యూరిటీలను  అహ్మదాబాదు, బెంగుళూరు, కోల్‌కత్త, చెన్నై, హైదరాబాదు, కాన్పూర్‌, న్యూఢిల్లీ, ముంబాయిలులోని రిజర్వు బ్యాంకు కార్యాలయల ద్వారా   చేయవలసి ఉంటుంది.

ఆధారము: భారతీయ రిజర్వు బ్యాంకు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate