చిన్న పిల్లల్లో అతిసారవ్యాధి తరువాత, తరచూ వచ్చి ప్రాణాంతకంగా మారే జబ్బు. ఇది ముఖ్యంగా వర్షాకాలం, చలికాలం 5 సం.లలోపు పిల్లలకి సంక్రమిస్తుంది. పోషకాహార లోపం, విటమిన్ ఎ లోపం, పూర్తి కోర్సు టీకాలు ఇవ్వకపోవడం, చిన్న పిల్లల్ని చలికి, వర్షానికి తడవనివ్వడం ముఖ్య కారణాలు.
కారక జీవులు:
బాక్టీరియా మరియు ఫ్లూ సంబంధిత వైరస్ లు
వ్యాపించే సమయం:
ఆగస్టు నుండి నవంబర్ వరకు
నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు:
- పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి. ఇతర పి.హెచ్.సి. సిబ్బందికి సహాయం అందించాలి. ప్రజలందరికీ సమాచారం, ఆరోగ్య విద్య అందించడంలో తోడ్పడాలి.
- పిల్లల్ని నీళ్ళలో, వర్షంలో, చలిలో ఆడుకోకుండా, తిరగకుండా ఉండేటట్లు తల్లితండ్రులకి అవగాహన ఏర్పరచాలి.
వ్యాధి లక్షణాలు:
- జ్వరం, ఆయాసం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో కష్టం, నీరసించిపోవడం.
- వ్యాధిని సరైన సమయంలో గుర్తించి యాంటిబయాటిక్స్, మందులు, ఆవిరి పట్టడం వంటివి డాక్టరు సూచనపై తల్లిదండ్రులు సరిగా అమలుపరిచేటట్లు సహాయం చేయాలి.
- పిల్లలు బావిలో దూకి ఈదడం, నీళ్ళలో నానడం, ఇతరులతో ఆడడం, ఆరుబయట చలిగాలికి ఎదురుపడడం వంటివి నివారించాలి. అవసరమైతే స్పెషలిస్టు సలహా, సేవ ఏర్పాటు చేయాలి.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.