অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

టైఫాయిడ్

టైఫాయిడ్ జ్వరాన్ని సన్నిపాత జ్వరము అని కూడా అంటారు. ఇది ప్రాణాంతకమైన జ్వరము మరియు ఇది సాతమెనెల్లా టైఫి (సా.టైపు) అను జీవాణుక్రిముల వల్ల కలుగుతుంది. దీనిని సూక్ష్మ జీవి నాశకము ఇవ్వడం ద్వారా నివారించవచ్చు మరియూ చికిత్స చేయవచ్చు.

సన్ని పాతజ్వరము ఎలా వ్యాపిస్తుంది ?

సాల్మోనెల్లా టైఫీ అను సూక్ష్మ జీవి మానవులలో మాత్రమే నివసిస్తుంది. వ్యాధిగ్రస్థులు ఈ సూక్ష్మజీవులకు వారి రక్త ప్రసరణలో మరియు అన్నవాహికలో ఆశ్రయమిస్తారు. దీనికి తోడు కొంత మంది రోగులు సన్నిపాత జ్వరం నుంచి కోలుకున్న తరువాత కూడా ఈ సూక్ష్మ జీవులకు వాహకాలుగా పని చేస్తూ వ్యాధి ప్రబలడానికి కారకులవుతారు.

వ్యాధిగ్రస్థులు, వాహకాలుగా పనిచేసే వారిద్దరి మలంలో ఈ సూక్ష్మ జీవులు వుండి నిరంతరం వ్యాపిస్తూ వుంటాయి. వ్యాధిగ్రస్థులైన వారిచే తయారు చేయబడిన లేక వడ్డించబడిన ఆహార పదార్దాలు కానీ లేక పానియాలు గానీ మీరు తీసుకోవడం వల్ల వ్యాధి మీకు సోకే అవకాశం వుంటుంది. ఈ సూక్ష్మ జీవులతో (సా.టైపు) కలుషితమైన నీరు మీరు త్రాగుటకు లేదా ఆహార పదార్దము శుభ్రపరుచుటకు వాడిన యడల మీరు వ్యాధిగ్రస్థులయ్యే ప్రమాదం వుంటుంది. కావున ఈ సన్నిపాత జ్వరం ప్రపంచంలో ఎక్కడైతే మలవిసర్జన తరువాత, భోజనమునకు ముందు చేతులు శుభ్రపరచుకునే అలవాటు లేదో మరియూ త్రాగునీరు మురుగు నీటితో కలిసే అవకాశం ఎక్కువగా ఉన్నదో ఆ ప్రాంతాలలో ఎక్కువగా ప్రబలే అవకాశం వుంటుంది. ఒక్కసారి ఈ సూక్ష్మ జీవి శరీరంలో ఆహారం లేక పానీయాల ద్వారా చేరిన వెంటనే అధిక సంఖ్యాకమై రక్తస్రావంలో చేరుతాయి. ఇట్టి పరిస్ధితిలో శరీరం ప్రభావితమై జ్వరం మరియూ ఇతర లక్షణాలతో ప్రతిక్రియ చూపుతుంది.

సన్నిపాత జ్వరం లక్షణాలు మరియు చిహ్నలు ఏవి ?

ఈ జ్వరం తో బాధపడే వారిలో సాధారణంగా జ్వరం 103° నుంచి 104° మధ్య నిలకడగా కొన్ని గంటల వరకూ ఉంటుంది. రోగికి బలహీనంగా అనిపిస్తుంది. తలనొప్పి, కడుపు నొప్పి మరియు ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనపడతాయి. కొంత మందిలో చర్మంపై గులాబిరంగు దద్దుర్లు కనపడతాయి. రోగ నిర్ధారణకు మల మరియు రక్త పరీక్షలు చేయవలసి ఉంటుంది. వీటిలో సా.టైఫి సూక్ష్మజీవులు కనపడతాయి.

సన్నిపాత జ్వరాన్ని ఏ విధంగా నివారించవచ్చు ?

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ జ్వరాన్ని నివారించవచ్చు.

  1. అపరిశుభ్రమైన ఆహారం, కలుషిత ఆహారం తీసుకొనకపోవడం.
  2. సన్నిపాత జ్వర నిరోధక టీకాలు వేయించు కొవడం.

తీసుకొనవలసిన మరియు తీసుకోగలిగిన జాగ్రత్తలు

  1. త్రాగు నీటిని ఒక నిమిషం వరకూ మరగనిచ్చి చల్లార్చిన తరువాత త్రాగడానికి  వినియోగించాలి.
  2. బయట ఏవైనా పానీయాలు తీసుకునేటప్పుడు ఐసు (మంచు) లేకుండా తీసుకోవాలి. తరువాత పానీయాలు మరిగించిన నీటిలో తయారు చేసినవయి వుండాలి. శీతల పానీయాలు ఐసుక్రీములు నివారించడం మంచిది. ఎందుకంటే అవి కలుషిత నీటితో తయారు చేయబడినవై ఉండవచ్చు.
  3. ఆహారం సంపూర్ణంగా వండినదై (ఉడికినవి) వేడిగా పొగలు వెలువడుతున్నప్పుడు తినడం మంచిది.
  4. తొక్కు తీయని కూరగాయలు గానీ పండ్లు గానీ, పచ్చి కూరగాయలు గానీ  తినడం  ఆరోగ్యకరం కాదు. పచ్చి ఆకు కూరలు (సలాడ్ లలో వాడేవి) శుభ్రపరచడం చాలా కష్టం
  5. పచ్చి కూరగాయలు, పండ్లు తినాలకున్నప్పుడు వాటి తొక్కు మీరు స్వయంగా తీసుకోండి. చేసే ముందు సబ్బుతో శుభ్రంగా చేతులు  కడుకోండి. తొక్కులు తినకండి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate