హోమ్ / ఆరోగ్యం / ప్రాథమిక చికిత్స / ప్రథమ చికిత్స పరికరాల పెట్టె
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రథమ చికిత్స పరికరాల పెట్టె

ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.

ప్రతి ఫ్యాక్టరీ, ఆఫీసు, పాఠశాల, ఇళ్లల్లో అందరికీ అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ఇది షాపులో రెడీమేడ్ గా లభిస్తుంది. మీరైతే రేకు లేదా అట్టపెట్టెతో మీ ఇంట్లో ప్రథమ చికిత్స బాక్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ క్రింద పేర్కొన్న పరికరాలు, వస్తువులు మీ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాలి.

ప్రథమ చికిత్స పరికరాల పెట్టె

 • ప్రథమ చికిత్స పుస్తకం
 • వివిధ రకాల సైజుల్లో అతుక్కునే గుణం గల బ్యాండేజీలు
 • పీల్చుకునే గుణం గల (అబ్జార్బెంట్) నూలు బ్యాండేజీ, లేదా రకరకాల సైజుల్లో ఉన్న నూలు గాజ్ ప్యాడ్లు
 • అతుక్కునే టేపులు
 • త్రికోణపు బ్యాండేజీ రోలు (చుట్ట)
 • ఒక చుట్ట దూది
 • బ్యాండ్ -ఎయిడ్స్ (ప్లాస్టర్స్)
 • కత్తెర
 • పెన్నుసైజు టార్చిలైటు
 • చేతులకు వేసుకునే తొడుగులు / లేటెక్స్ గ్లోవ్స్ (రెండు జతలు)
 • ట్వీజర్స్ (పట్టుకర్ర)
 • సూది
 • తడిగా గల టవలు మరియు శుభ్రమైన పొడి బట్ట ముక్కలు
 • యాంటీ -సైప్టిక్ ద్రవం (సేవ్లన్ / డెట్టాల్)
 • థర్మోమీటర్
 • ఒక చిన్న వాజ్లీన్ (ప్రెట్రోలియం జెల్లీ) ట్యూబ్ లేదా ఇతర ల్యూబ్రికెంట్ (పొడిబారిన చర్మాన్ని మెత్తబరిచే క్రీములు)
 • వివిధ రకాల సైజుల్లో పీన్నీసులు ( సేఫ్టీ పిన్నులు )
 • సబ్బు లేదా డిటర్జెంట్ పొడి

ఔషధాలు

 • ఆస్పిరిన్ లేదా నొప్పి తగ్గించే పారాసెటమాల్ మాత్రలు
 • విరేచనాలు అరికట్టే (యాంటీ – డయోరియా)  ఔషధాలు
 • తేనెటీగలు కుట్టిన చోట్ల పూయటానికి యాంటీ హిస్టామిన్ క్రీము ( అలర్జీలు/ దురదలు మంటలు దగ్గేందుకు క్రీమ)
 • అజీర్తికి, అసిడిటికి మాత్రలు ( ఆంటాసిడ్ మాత్రలు)
 • విరేచనం సాఫీగా అవ్వటానికి (ల్వాక్సెటివ్) మాత్రలు

సుళువుగా అందుబాటులో ఉండేలా మీ ప్రథమ చికిత్స పెట్టెను ఏర్పాటు చేసుకోవాలి. గడువు తీరిన ఔషధాలను పారేసి, తాజా ఔషధాలను బాక్స్ లో పెట్టాలి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.03370786517
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు