অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కలరా

 కలరా వ్యాధి వీడియో

కలరా అంటే ఏమిటి?

విబ్రియో కలరా బ్యాక్టీరియమ్‌ చిన్న ప్రేవుకు సోకడం వలన వచ్చే తీవ్రమైన అతిసార వ్యాధినే కలరా అంటారు.ఈ అంటు వ్యాధి తరచుగా తక్కువగాను, లేదా లక్షణాలేమీ కన్పించకుండానే వస్తుంది. కానీ కొన్ని సార్లు తీవ్రంగా కూడ వస్తుంది.

కలరా వ్యాధికి గల లక్షణాలు ఏమిటి ?

20 మందికి కలరా సోకితే అందులో సుమారుగా ఒకరికి తీవ్రవైున వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. అవిః

 • నీళ్ల విరేచనాలు అధికంగా కావడం.
 • వాంతులవడం, మరియు
 • కాళ్ల కండరాలు పట్టుకుపోవడం/తిమ్మిరెక్కడం.

ఈ వ్యక్తులు శరీరంలోని ద్రవ పదార్ధాలు త్వరితంగా కోల్పోవడం, ఆకస్మిక వ్యాకులత చెందడం జరుగుతుంది. సరైన సమయంలో చికిత్స గనక జరగకపోతే కొద్ది గంటల వ్యవధిలోనే మరణిస్తారు.

ఏ వ్యక్తికైనా కలరా ఎలా వస్తుంది?

కలరా, బ్యాక్టీరియమ్‌ గల కలుషితమైన నీటిని తాగడం లేదా కలుషితమైన ఆహారం తినడం ద్వారా ఏ వ్యక్తికైనా రావచ్చు. అంటువ్యాధిసోకిన వ్యక్తి యొక్క మల విసర్జితంతో కలుషితమైన వాటి మూలంగా సమాజం లోని కూటమి ఒకే చోట నివసించే వారందరికి సామాన్యంగా కలరా వస్తుంది. మురుగునీరు, మంచి నీటి సదుపాయాలు తగిన రీతిలో లేనప్పుడు శీఘ్రంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

చవిటిగా ఉండి కొద్దిగా ఉప్పదనంగల నదులలోను, సముద్ర తీరపు నీటి వాతావరణంలో కూడ కలరా బ్యాక్టీరియమ్‌ నివసించగలదు.

శుభ్రంగాలేని లేదా సరిగా ఉడకని ఎండ్రకాయ, రొయ్యలు మొదలగు వాటిని తినడం మూలంగా కలరా రావచ్చును. ఈ వ్యాధి నేరుగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. కాబట్టి, సాధారణ స్పర్శ ద్వారా అంటువ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వచ్చే ప్రమాదం లేదు.

కలరాకు చికిత్స చేయగలమా?

అతిసారం వలన కోల్పోయిన ద్రవాలను, లవణాలను తిరిగి రోగికి చక్కెర , ఉప్పు మిశ్రమ ద్రావణం వెంటనే ఇవ్వడం ద్వారా చక్కటి చికిత్స జరుగుతుంది. నోటిద్వారా జల ద్రావణాన్ని (ఓరల్‌ డీ హైడ్రేషన్‌), పొట్లంలో గల చక్కెర, ఉప్పు మిశ్రమానికి  నీటిని చేర్చి ఎక్కువ మొత్తంలో తాగించడం ద్వారా చికిత్స చేయడం. ప్రపంచ వ్యాప్తంగా ఈ ద్రావణాన్ని డయేరియా (అతిసార) చికిత్సకు ఉపయోగిస్తున్నారు. తీవ్రమైన వ్యాధిగలవారిలో కూడ రక్తనాళాలకు నేరుగా ఈ ద్రవాన్ని చేరేటట్లుగా ఎక్కించాలి. శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి చేరేటట్లు చేయాలి. నిర్జలీకరణాన్ని లేకుండ చేయడం ద్వారా ఒక శాతం కన్నా తక్కువ మంది కలరా వ్యాధిగ్రస్తులు చని పోతున్నారు.

ఏంటీబయాటిక్స్‌ వల్ల చికిత్సా సమయం తగ్గించబడి, వ్యాధి తీవ్రత తగ్గుతుంది. కానీ ఎంత చేసినప్పటికినీ ఉప్పు, చక్కెర మిశ్రమ ద్రావణం కన్నా మేలైనది కాదు. ఏ దేశంలోనైతే కలరా వ్యాపించబడి, తీవ్రమైన విరేచనాలు మరియు వాంతులతో బాధపడుతున్న వ్యక్తులకు తక్షణమే వైద్య చికిత్సను అందుబాటులోకి తేవాలి.

తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు

 • బూడిద సేకరణ గుంటలను శుభ్రపరచడం, స్వేచ్చగా గాలి ప్రసరించెటట్లుగానూ  మరియు ఉంటున్న ప్రదేశంలో  అంటు వ్యాధిసోకకుండా చేయడం.
 • శారీరకంగా లేదా మానసికంగా అధిక అలసట చెందకుండా చూసుకోవాలి. శీఘ్రంగా ఉష్ణోగ్రతలో వచ్చే మార్పులకు గురి కాకూడదు.
 • గుంపులలో ఉండడం చేయకూడదు.
 • మరగకాచిన నీటిని చల్లార్చి, ఒక సీసాలో సగం వరకు నింపి చక్కగా బిగించి  ఉంచి తాగే  కొద్దినిమిషాల ముందు సీసాను బాగా గిలకరించాలి. మంచి నీటితో నింపే సీసాతోబాటు, నీరు తాగే కప్పులను లేదా గ్లాసులను కూడ సలసల కాగే  నీటిలో  వేసి శుభ్రం చేయాలి.
 • మరిగించని దేనినీ కూడ తాగకూడదు.
 • అన్నీ ఆహార పదార్ధాలను బాగా వండాలి. కాచిన నీటిలో బాగుగా కడిగిన పండ్లనన్నింటినీ వేడి నీటిలో  కడిగిన గిన్నెలలో  మాత్రమే  ఉంచాలి; లేదా పండ్లను కడిగిన తర్వాత వాటిపైన గల తొక్కలను తొలగించడం, లేదా బట్టతో అన్ని రకాల పండ్ల పైన కప్పి ఉంచడం మెరుగైన పద్ధతి.
 • సామాన్యంగా తీసుకునే రొట్టె, వెన్నకు బదులుగా వెచ్చ చేసిన (నిప్పుల ముందు కల్చిన) వాటిని తీసుకోవాలి.
 • వేడి, వేడిగా భోంచేయడం చాలా మంచిది.
 • అన్ని గిన్నెలు, గ్లాసులు, కత్తులు, ఫోర్కులు, చెంచాలు, పెనము/బాణలి, తినడానికి వినియోగించే  అన్నింటినీ ఉపయోగించడానికి ముందు, వేడి నీటితో కడగాలి. ఏవేవిుటి తయారుచేస్తారో వాటిని అన్నింటిని  వేడిపొయ్యి పై వేడిమితో ఉంచాలి.
 • మరగకాచని నీటిలో దేనిని కడగరాదు.
 • రోజులో చాలాసార్లు , భోజనానికి ముందు చేతులను, ముఖాన్ని  కార్బాలిక్‌ ఆమ్లంతో కలిసిన కాచిన నీటితో శుభ్రం చేసుకోవాలి.
 • వీలైతే ప్రతీసారి శుభ్రంగా ఉతికిన తువ్వాళ్ళనే వాడాలి.
 • కడగడానికి వినియోగించే నీటిని మరిగే ఉష్ణోగ్రత వద్దకు వచ్చేటంత వరకు ఉంచి తర్వాత చల్లబరచాలి.
 • పక్క బట్టలను, విసర్జన శాలలో ఉపయోగించే బట్టలను మరిగే నీటిలో వేసిన తర్వాత ఎండలో ఆరవేయాలి.
 • వాడిన ప్రతీసారి కంచాలను/పళ్ళాలను శుభ్రపరచే బట్టలు, అన్నీ రకాల పొడిగా ఉంచే బట్టలను మరిగే నీటిలో వేయాలి. మరల వాడవలసినప్పుడు బాగా ఆరబెట్టి, వేడిచేయాలి.
 • కుటుంబంలో ఒక వ్యక్తికి గనక కలరా వస్తే అతనిని ఇతరులు నుండి విడిగా ఉంచాలి.
 • కలరా రోగిగ్రస్తుల దేహాలను శుభ్రపరచడానికి లేదా వారి దుస్తులను మరియు  మురికైన  బట్టలను జాగ్రత్తగా  తొలగించడానికి,  నోటిని, ముక్కురంధ్రాలను అరంగుళం మందం మేరకు దూదిని/ బట్టతోదట్టించిన స్వచ్చమైన లోహపు బట్టతో తయారుచేసిన  చిన్నపాటి ముసుగుతో కప్పి ఉంచుకోవడం తప్పనిసరిగా చేయాలి. ముసుగును /తొడుగును 150డిగ్రీల సెంటిగ్రెడ్‌ వేడిమికి గురిచెయ్యాలి. వినియోగించిన ప్రతిసారి అంతే వేడిమి ఉండేటట్లు చూడాలి. మంట కొలిమి యెదుట ముసుగును పట్టుకుని ఉంటె  ఆ వేడిమి కల్గుతుంది. వాడిన ప్రతీసారి అదే వేడిమి చివరిదాకా ఉండాలి.
 • కలరా రోగగ్రస్తులను ఉంచిన గదులను ముందుగా  అనేక గంటలసేపు  ఎవ్వరూ లేదా ఇతరులు ప్రవేశించకుండా మూసి ఉంచాలి.

ఆధారము: Medicinenet© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate